రామోజీరావు మృతిపై రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. రామోజీరావు కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. రామోజీరావు మరణం తీరని లోటు అని అన్నారు. దేశంలో ఇంత పలుకుబడి ఉన్న వ్యక్తిని తాను ఇంత వరకు చూడలేదన్నారు. రామోజీరావును కలవాలని అనుకున్నానని.. కానీ కలవలేకపోయానన్నారు. రామోజీరావు, మార్గదర్శి వ్యవహారంపై తన పోరాటం ఇక ఉండదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు ఉండవల్లి.
Ramoji Rao-Undavalli: రామోజీరావు దేశంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తి: ఉండవల్లి
మన దేశంలో రామోజీరావు అంత పలుకుబడి ఉన్న వ్యక్తిని తాను చూడలేదని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. రామోజీరావు కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. రామోజీరావును కలవాలని అనేక సార్లు భావించానని.. కానీ కుదరలేదన్నారు.
New Update
తాజా కథనాలు