Ramoji Rao: రామోజీ రావు మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు: చిరంజీవి
ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు పార్థివదేహానికి మెగాస్టార్ చిరంజీవి నివాళులర్పించారు. రామోజీరావు మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటని అన్నారు. ప్రజారాజ్యం పార్టీ స్థాపించే సమయంలో ఆయన సలహాలు, సూచనల కోసం కలిసేవాడినంటూ ఆనాటి రోజులను గుర్తుకుచేసుకున్నారు.