/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/chiranjevi.jpg)
Chiranjeevi Birthday Celebrations :ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు (Arani Srinivasulu) తన నివాసంలో పద్మభూషణ్ డాక్టర్ చిరంజీవి (Chiranjeevi) జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. తిరుపతి (Tirupati) లోని ఎమ్మెల్యే నివాసంకు చేరుకున్న చిరంజీవి దంపతులకు అభిమానులు, ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు.
Also Read: ఆపద్బాంధవుడు అన్నయ్య.. చిరంజీవికి పవన్ బర్త్ డే విషెస్
అనంతరం ఎమ్మెల్యే కోరిక మేరకు మెగాస్టార్ చిరు కేక్ కట్ చేసి సతీమణి సురేఖకు, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు తినిపించారు. ఈ వేడుకల్లో శ్రీమతి సురేఖతో పాటు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం తేనీటి విందు చేసిన చిరంజీవి అభిమానులతో ఫోటో దిగారు. తధానంతరం చిరంజీవి హైదరాబాద్ బయలుదేరి వెళ్ళారు.
 Follow Us