Pawan Kalyan: కొలిక్కి వచ్చిన తిరుపతి జనసేన పంచాయితీ!
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తిరుపతి టీడీపీ నేతలతో జరిపిన భేటీ సఫలం అయ్యింది. దాదాపు గంటపాటు ఆయన సుదీర్ఘంగా మాట్లాడిన తీరుతో టీడీపీ ముఖ్యనాయకులు శాంతపడినట్లే కనిపించారు. జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులుతో కలిసి పనిచేసేందుకు సూత్రప్రాయంగా వారంతా అంగీకారం తెలిపారు .