China Manja : వెయ్యికి పైగా పక్షుల ప్రాణాలు తీసిన చైనా మాంజా

నిషేధిత చైనా మాంజా తగిలి ముంబై నగరంలో వెయ్యికి పైగా పక్షులు ప్రాణాలు కోల్పొయాయి. 800 వరకు గాయపడ్డాయి. చైనా మాంజాతో మనుషులు కూడా ప్రాణాలు పొగొట్టుకున్న సందర్భాలున్నాయి.

New Update
China Manja : వెయ్యికి పైగా పక్షుల ప్రాణాలు తీసిన చైనా మాంజా

పోలీసులు ఎన్నిరకాలుగా చర్యలు తీసుకున్నా, నిషేధం విధించిన దేశంలో చైనా మాంజా విక్రయాలు ఆగలేదు. గాలిపటాలు ఎగురవేసే క్రమంలో చైనా మాంజా మూలంగా దేశవ్యాప్తంగా అనేకమంది ప్రాణాలు పోయాయి. ఇక పక్షుల మరణాలకు లెక్కేలేదు. కేవలం ఈ రెండురోజుల్లో ఒక ముంబైలోనే వెయ్యికి పైగా పక్షులను చైనా మాంజా బలితీసుకుందని పక్షి ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి : Man Dressed As His Girlfriend To Write Exam :స్నేహితురాలి వేషంలో పరీక్ష రాయాలని అమ్మాయిలా నటించి…

సంక్రాంతి పండుగ సందర్భంగా గాలి పటాలు ఎగురవేయటం ఆనవాయితీ. అయితే గాలిపటాలు ఎగురవేయడానికి నిషేధిత చైనా మాంజా వాడడమే ప్రాణసంకటంగా మారుతుంది. ఈ చైనా మాంజా ఇప్పటికే మనుషుల ప్రాణాలను బలితీసుకోవడంతో పాటు పక్షుల ప్రాణాలను హరించింది. సంక్రాంతి రెండు రోజుల వ్యవధిలో ఒక ముంబైలోనే 1000 పక్షులు మరణించగా, 800 పక్షులు తీవ్రంగా గాయపడ్డాయి.

ముంబైలో సంక్రాంతి పండుగ సందర్భంగా గాలిపటాలు ఎగురవేసే సందర్భంలో పక్షులకు ప్రాణహానీ తప్పదని ముందే గ్రహించిన పక్షి ప్రేమికులు నగర వ్యాప్తంగా 25 చోట్ల ఉచిత బర్డ్ మెడికల్‌ క్యాంపులను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గాయపడ్డ పక్షులను  ఈ కేంద్రాలకు తరలించి చికిత్స అందించారు. కొన్ని ప‌క్షుల కాళ్ల‌కు తీవ్ర గాయాలు కావ‌డంతో అవి ఎగ‌ర‌లేక పోతున్నాయి. అలాంటి వాటిని ప్ర‌త్యేక షెల్ట‌ర్ల‌లో ఉంచి ప‌ర్య‌వేక్షిస్తామ‌ని ప‌క్షి ప్రేమికులు తెలిపారు. చికిత్స అనంత‌రం కొన్ని ప‌క్షులను తిరిగి గాల్లోకి వదిలి పెట్టారు.బోరివాలి, కందివాలి, ద‌హిస‌ర్, మ‌లాద్ ఏరియాల్లో సుమారు 500ల‌కు పైగా ప‌క్షులను పలువురు ప్రాణాల‌తో ర‌క్షించారు.

ఇది కూడా చదవండి :Job Tips: కొత్తగా ఉద్యోగంలో చేరారా?.. ఈ జాగ్రత్తలు తీసుకోండి

చైనా మాంజా ప్రమాదకరం అని, దాన్ని వాడొద్దని మీడియా, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. పలువురు సెలబ్రిటీలతోనూ మీడియాలో చెప్పించిన ప్రయోజనం లేకపోయింది. గాలి పటాలు ఎగురవేసే క్రమంలో వాహనదారుల కుతగిలి వారు ప్రాణాలు కోల్పొతున్నారు. ఇక పక్షుల విషయం చెప్పక్కర్లలేదు. గాలిలో ఎగిరే సమయంలో మాంజా తగిలి అవి ప్రాణాలు పొగొట్టుకుంటున్నాయి. కేవలం పక్షిప్రేమికులే కాకుండా అందరిలోనూ చైనా మాంజా వల్ల జరిగే నష్టం పై అవగాహన రావలసిన అవసరం ఉంది.

Advertisment
తాజా కథనాలు