Hyderabad: జవాన్ ప్రాణం తీసిన మాయదారి మాంజా.. రాష్ట్రంలోనూ పలు ఘటనలు మాయదారి మాంజా ఆర్మీ జవాన్ ప్రాణం తీసింది. లంగర్ హౌస్ లోని మిలటరీ ఆసుపత్రిలో అధికారిగా పనిచేస్తున్న విశాఖపట్నం పెద్ద వాల్తేరు గ్రామానికి చెందిన కాగితాల కోటేశ్వరరావు విధులు ముగించుకుని స్కూటీపై ఇంటికి వెళ్తుండగా మాంజా మెడకు చుట్టుకుని గొంతు కోసేసింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. By srinivas 14 Jan 2024 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి Hyderabad : మాయదారి మాంజాలు అమాయకుల ప్రాణాలు తీస్తూనే ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలుమార్లు నిషేధం విధించినప్పటికీ మాంజా దారం విచ్చల విడిగా అమ్ముతున్నారు. ముఖ్యంగా చైనా మాంజా విక్రయం, వినియోగాన్ని ప్రభుత్వం పూర్తిగా నిషేధించింది. అయినా కొందరు వ్యాపారులు కాసుల కక్కుర్తితో చైనా మాంజా విక్రయాలు గుట్టుగా సాగిస్తున్నారు. ప్రాణాంతకంగా మారుతున్నా చైనా మాంజా.. కలిగే అనర్థాలను కళ్లారా చూస్తున్నా జనాల్లో మార్పు రావడం లేదు. తాజాగా ఈ మాంజా దారం తెగి ఆర్మీ జవాన్ (Army jawan) మృతి చెందిన భయంకరమైన ఘటన లంగర్ హౌస్ (Langar House) పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఆర్మీ అధికారి కాగితాల కోటేశ్వరరావు.. ఈ మేరకు ఇన్స్పెక్టర్ నిరంజన్ రావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖపట్నం పెద్ద వాల్తేరు గ్రామానికి చెందిన కాగితాల కోటేశ్వరరావు(30) (Kagitaala Koteswara Rao) (నాయక్ ) ఆర్మీ అధికారిగా లంగర్ హౌస్ లోని మిలటరీ ఆసుపత్రిలో పని చేస్తున్నారు. కాగా కొంతకాలంగా లంగర్ హౌస్ లోని బాపునగర్ లో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. అయితే కోటేశ్వరరావు శనివారం రాత్రి విధులు ముగించుకొని స్కూటీపై ఇంటికి వెళ్తున్న క్రమంలో లంగర్ హౌస్ లోని ఇంద్రారెడ్డి ఫ్లై ఓవర్ పైన ఆయన మెడకు మాంజాదారం తగలడంతో తీవ్రంగా గాయపడ్డారు. తీవ్ర రక్తస్రావం.. దీంతో స్థానికులు గమనించి వెంనటే మిలటరీ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే తీవ్ర రక్తస్రావం అయిన కోటేశ్వరరావు మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారని నిరంజన్ తెలిపారు. ఆదివారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించామన్నారు. అనంతరం మృతదేహాన్ని ఆర్మీ ఉన్నతాధికారులు సందర్శించి నివాళులు అర్పించగా.. ఆదివారం మృతుడి భార్య ప్రత్యుష ఫిర్యాదు మేరకు కేసు చేసి దర్యాప్తు చేస్తున్నామని, ఇందుకు సంబంధించిన నిందితులను పట్టుకుంటామని ఇన్స్పెక్టర్ తెలిపారు. ఇది కూడా చదవండి : Karimnagar : జిల్లాల పునర్విభజనపై పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు.. బీఆర్ఎస్, బీజేపీకి సవాల్ మంచిర్యాలలో గొంతు తెగి.. అలాగే మాంజా తెగి ఓ వ్యక్తి మరణించిన ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పాత మంచిర్యాల లో ద్విచక్ర వాహనంపై లక్షెట్టిపేట వైపు వస్తున్న వ్యక్తికి గాలిపటం మాంజా దారంతో గొంతు తెగి వ్యక్తి మృతి చెందాడు. మృతుడు జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంకు చెందిన వసరత్ భీమయ్య గా గుర్తించారు. పోలీసులు కేస్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జగిత్యాలలో బాలుడు.. జగిత్యాలలో వెంకటేశ్ అనే బాలుడు సాయంత్రం పొలం నుంచి ఎడ్లబండిపై ఇంటికి వెళ్తున్నాడు. ఆ సమయంలో దారిలో ఓ చెట్టుకి తట్టుకుని ఉన్న గాలిపటం మాంజ దారం మెడకు చుట్టుకుని తీవ్ర గాయమైంది. స్థానికులు గమనించి వెంటనే వెంకటేశ్ ను ఆసుపత్రికి తరలించడంతో డాక్టర్లు చికిత్స అందించారు. దీంతో వెంకటేశ్ కు ప్రాణాపాయం తప్పింది. కాగా, మాంజా దారాన్ని ప్రభుత్వం నిషేధించినప్పటికీ అక్కడక్కడా కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనతో అప్రమత్తమైన పంచాయితీ పాలక మండలి గ్రామంలో మాంజ దారం విక్రయించడానికి వీల్లేదంది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరికలు చేసింది. #died #koteswara-rao #china-manja #army-jawan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి