Hyderabad: జవాన్ ప్రాణం తీసిన మాయదారి మాంజా.. రాష్ట్రంలోనూ పలు ఘటనలు
మాయదారి మాంజా ఆర్మీ జవాన్ ప్రాణం తీసింది. లంగర్ హౌస్ లోని మిలటరీ ఆసుపత్రిలో అధికారిగా పనిచేస్తున్న విశాఖపట్నం పెద్ద వాల్తేరు గ్రామానికి చెందిన కాగితాల కోటేశ్వరరావు విధులు ముగించుకుని స్కూటీపై ఇంటికి వెళ్తుండగా మాంజా మెడకు చుట్టుకుని గొంతు కోసేసింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.