China: మళ్ళీ వంకర బుద్ధి చూపించిన చైనా..అరుణాచల్ ప్రాంతాలకు సొంతపేర్లు

చైనా తన బుద్ధి పోనిచ్చుకోవడం లేదు. వద్దంటున్నా మళ్ళీ మళ్ళీ భారత్‌ మీద ఆధిపత్యం చెలాయించాలనే చూస్తోంది. తాజాగా మళ్ళీ అరుణాచల్ ప్రదేశ్‌లో పలు ప్రాంతాలు తమవేనంటూ వ్యాఖ్యలు చేయడమే కాకుండా...వాటికి తమ సొంత పేర్లను కూడా ప్రకటించింది.

New Update
China: మళ్ళీ వంకర బుద్ధి చూపించిన చైనా..అరుణాచల్ ప్రాంతాలకు సొంతపేర్లు

China Renames 30 places in Arunachal Pradesh: భారత్, చైనా సరిహద్దు ప్రాంత అయిన అరుణాచల్ ప్రదేశ్ మీద చైనా మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేసింది. అరుణాచల్‌లోని పలు ప్రాంతాలు తమవేనని చెప్పడమే కాకుండా వాటి పేర్లను కూడా మారుస్తున్నట్లు తెలిపింది. మొత్తం 30 ప్రాంతాలకు కొత్త పేర్లను పెట్టి వాటిని తమ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచింది డ్రాగన్ కంట్రీ. చైనా అధికారిక మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్ (Global Times) ఈ విషయాన్ని తెలిపింది. ఈ పేరు మార్పులు మే 1 నుంచి అమల్లోకి వస్తాయని కూడా ప్రకటించింది. అప్పటి నుంచి వాటిని కొత్త పేర్లతోనే పిలవాలని చైనా స్పష్టం చేసింది.

Also Read: కడప జిల్లా రాజంపేట టీడీపీలో అసమ్మతి సెగలు

చైనా (China) పేర్లు మార్చిన ప్రదేశాల్లో 11 నివాస ప్రాంతాలు, 12 పర్వతాలు, నాలుగు నదులు, ఒక సరస్సు, ఒక పర్వత మార్గం ఉన్నాయి. ఆ పేర్లు ఏంటవనేవి బయటకు రానప్పటికీ అవన్నీ చైనీస్ (Chinese Language), టిబెటిన్, పిన్‌యిన్ భాషల్లో పెట్టినట్లు తెలుస్తోంది. దాంతో పాటూ అరుణాచల్‌ను దక్షిణ టిబెట్‌గా వ్యవహరించడమే కాకుండా జాంగ్నాన్ (Zangnan) అని పిలవాలని చెబుతోంది డ్రాగన్ కంట్రీ. అరుణాచల్ ప్రదేశాలకు కొత్త పేర్లను పెడుతూ చైనా లిస్టును విడుదల చేయడం ఇది నాలుగోసారి. 2017 నుంచి ఇలా పేర్లను మారుస్తూనే ఉంది. దీని మీద భారతదేశం చాలా సార్లు తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తూనే ఉంది. అయినా చైనా తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి వాటిని పక్కన పెట్టేస్తూనే ఉంది.

మరోవైపు భారత్ చైనా తీరును ఖండించింది. పేర్లు మార్చినంత మాత్రాన అరుణాచల్ ప్రదేశ్‌లోని ప్రాంతాలు భారత్‌లో భాగం కాకుండా పోవని అంటోంది. నిజాన్ని ఎవరూ మార్చలేరని స్పష్టం చేసింది. అరుణాచల్ ప్రదేశ్‌ ఎప్పటికీ తమదేశ అంతర్భాగమేనని తేల్చి చెప్పింది.

Advertisment
తాజా కథనాలు