chhattisgarh congress:దేన్ని దేనికి ముడిపెట్టారురా బాబూ.. ప్రచారంలో రచ్చ చేస్తున్న ఛత్తీస్ఘడ్ కాంగ్రెస్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, ఉప్పల్ బాలుల ఫోటోలతో ఛత్తీస్‌ఘడ్ కాంగ్రెస్ పార్టీ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. కాంగ్రెస్ గ్యారంటీలు ధోనీలాంటివి అయితే మోదీ గ్యారెంటీలు ఉప్పల్ బాలు లాంటవి అంటూ వారిద్దరి ఫోటోలతో ట్వీట్ పెట్టింది. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. By Manogna alamuru 04 Nov 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి మరికొన్ని రోజుల్లో ఛత్తీస్‌ఘడ్ ఎలక్షన్స్ జరగనున్నాయి. ఛత్తీస్‌గడ్‌లో శాసనసభ ఎన్నికలు రెండు విడతల్లో జరగునున్నాయి. ఈ నెల 7, 17 వ తేదీన ఇక్కడ పోలింగ్ జరగనుంది. మరో ఐదు రోజుల్లో ఛత్తీస్‌ఘడ్‌లోని ఇరవై స్థానాల్లో తొలివిడత పోలింగ్ జరగనుంది. ఈ రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇక్కడ పోటీలో ఉన్న కాంగ్రెస్, బీజెపీలు ఇప్పటివరకు మేనిఫెస్టోలను ప్రకటించకపోయినప్పటికీ ప్రచారం తెగ చేసేస్తున్నాయి. Also Read:సెంటిమెంట్ కంటిన్యూస్…కోనాయిపల్లి గుడికి సీఎం కేసీఆర్ ఛత్తీస్‌ఘడ్‌లో ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ జోరు మీదుంది. ఆ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకలు కూడా ఉచిత హామీలతో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అలాగే సోషల్ మీడియాలో కూడా బాగా ప్రచారం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రచారంలో భాగంగా ఇటీవల చేసిన ఒక ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. ఇండియా మాజీ క్రికెట్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని, తెలుగు వాళ్ళకు బాగా పరిచయం ఉన్న ఉప్పల్ బాలుల ఫోటోలతో ఛత్తీస్‌ఘడ్ కాంగ్రెస్ ట్వీట్ చేసింది. ట్వీట్లో ధోనీ, ఉప్పల్ బాలూల ఫోటోలు పెట్టి...కాంగ్రెస్ హామీలు ధోనీ లాంటివి అయితే బీజెపీ హామీలు ఉప్పల్ బాలూ వంటివి అని పెట్టింది. దాంతో పాటూ బీజెపీవి అన్ని మోసపూరిత హామీలే అంటూ క్యాప్షన్ కూడా రాసింది. ఒకప్పటి ధోనీ పొడుగు జత్తు, ఉప్పల్ బాలు హెయిర్ ఒకలానే ఉండి ఇద్దరికీ కొంచెం పోలికలు కలుస్తాయి. దీన్ని తన ప్రచారానికి ఆయుధంలా వాడేసుకుంది ఛత్తీస్‌ఘడ్ కాంగ్రెస్. ఈసారి కూడా అధికారం చేజిక్కించుకోవాలని అనుకుంటోంది ఛత్తీస్‌ఘడ్ లోని కాంగ్రెస్ పార్టీ. దాని కోసం అన్ని రకాలుగా ప్రచారం చేస్తూ దూసుకుపోతోంది. What's the Difference between Dhoni and Congress ?? Dhoni owns his Opponents. https://t.co/LvTPNi2riC — MAHIYANK™ (@Mahiyank_78) November 3, 2023 Also read:కర్ణాటకలో చీకట్లు…కరెంట్ లేక అవస్థలు పడుతున్న జనాలు #congress #viral #chhattisgarh #tweet #ex మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి