Chandrayaan-3: ఇస్రోలో జాబ్‌ తెచ్చుకోవడం ఎలా? ప్రస్తుత ఉద్యోగ అవకాశాలేంటి?

ఇస్రో(ISRO)లో జాబ్‌ చాలా మంది కల. చిన్నతనం నుంచే ఇస్రోలో ఉద్యోగం సాధించాలని చాలా మంది విద్యార్థులు కలలు కంటారు. జాబిల్లిపై చంద్రయాన్‌-3 ల్యాండింగ్‌ వేళ ఇస్రో జాబ్స్‌ గురించి సోషల్‌మీడియాలో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఫార్మసిస్ట్-ఏ, రేడియోగ్రాఫర్-ఏ, ల్యాబ్ టెక్నీషియన్-ఏ, కుక్, లైట్ వెహికల్ డ్రైవర్ 'ఏ', హెవీ వెహికల్ డ్రైవర్ 'ఏ' , ఫైర్‌మెన్ 'ఏ' లాంటి జాబ్స్‌కి రిక్రూట్‌మెంట్‌ జరుగుతోంది.

New Update
Chandrayaan-3: ఇస్రోలో జాబ్‌ తెచ్చుకోవడం ఎలా? ప్రస్తుత ఉద్యోగ అవకాశాలేంటి?

Check ISRO Jobs, Eligibility Here: చంద్రయాన్-3(Chandrayaan 3) ప్రయోగం చూసి దేశం ఉప్పొంగిపోతోంది. ముఖ్యంగా విద్యార్థులకు స్పేస్‌(Space) విషయంలో ఆసక్తి ఎక్కువ. పెద్దయ్యాక ఏం అవుతావ్ అని చిన్నతనంలో స్కూల్‌లో అడిగితే చాలా మంది సైంటిస్టును అవుతా అని చెప్పుకునేవాళ్లు. ఖగోళ శాస్త్రంపై ఇంట్రెస్ట్ చూపించేవాళ్లు ఎందరో ఉంటారు. సబ్జెట్‌పై గ్రిప్‌ ఉంటే మనం అనుకున్నది సాధించుకోవచ్చు. ఇక ఇస్రోలో జాబ్‌ అన్నది చాలా మంది కల. చంద్రయాన్-3 జాబిల్లిపై ల్యాండ్ కానున్న వేళ విద్యార్థులు ఇస్రో(ISRO)లో అందుబాటులో ఉన్న కెరీర్ అవకాశాలు, ప్రస్తుత ఉద్యోగ అవకాశాలు, అవసరమైన అర్హతలు, ఎంపిక ప్రక్రియ లాంటి వివరాలను చెక్‌ చేసుకోండి.

➼ ఆ లెవల్‌ వేరు:
ఇస్రో శాస్త్రవేత్తలు అత్యంత నైపుణ్యం కలిగిన ఉంటారు. వివిధ అంతరిక్ష ప్రాజెక్టులు, మిషన్ల రూపకల్పన, అభివృద్ధి లాంటి వాటికి బాధ్యత వహిస్తారు. అంతరిక్ష పరిశోధన, ఉపగ్రహ సాంకేతికత సంబంధిత రంగాలలో దేశ సామర్థ్యాలను ప్రపంచానికి చూపించడంలో వీరు కీలక పాత్ర పోషిస్తారు. ఇస్రో తన అధికారిక వెబ్‌సైట్ లో ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తల రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేస్తుంది.

➼ ISROలో ప్రస్తుత ఉద్యోగాలు:

ప్రస్తుతం ఇస్రో క్యాటరింగ్ సూపర్‌వైజర్, నర్సు-బీ, ఫార్మసిస్ట్-ఏ, రేడియోగ్రాఫర్-ఏ, ల్యాబ్ టెక్నీషియన్-ఏ, కుక్, లైట్ వెహికల్ డ్రైవర్ 'ఏ', హెవీ వెహికల్ డ్రైవర్ 'ఏ' , ఫైర్‌మెన్ 'ఏ'లను నియమిస్తోంది. దరఖాస్తుకు చివరి తేదీ రేపే(ఆగస్టు 24).

➼ జీతం: పే మ్యాట్రిక్స్‌లోని లెవెల్ 10 ప్రకారం శాలరీ

➼ ఇస్రోలో ఇతర ఉద్యోగాలు:

శాస్త్రవేత్త కాకుండా, ISRO టెక్నీషియన్ 'B', డ్రాఫ్ట్స్‌మన్ 'B', టెక్నికల్ అసిస్టెంట్/సైంటిఫిక్ అసిస్టెంట్/లైబ్రరీ అసిస్టెంట్-ఏ, నర్సు, అసిస్టెంట్, సపోర్ట్ స్టాఫ్, ఇతర పోస్టులను నియమిస్తుంది. 10వ తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ వరకు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇస్రోలో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేయడానికి, ఆసక్తి ఉన్న అభ్యర్థులు రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను చెక్‌ చేస్తూ ఉండాలి.

➼ అర్హత: కనీసం 65శాతం మార్కులతో ఇంజనీరింగ్ లేదా సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ లేదా CGPA 6.84/10 కలిగి ఉండాలి. దరఖాస్తు ముగింపు తేదీ నాటికి 28 ఏళ్లు మించకూడదు.

➼ ఎంపిక ప్రక్రియ: ఎంపిక ప్రక్రియ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఉంటుంది. రెండు భాగాలతో కూడిన ఒకే ఆబ్జెక్టివ్ టైప్ పేపర్ ఉంటుంది. అంటే పార్ట్ 'ఏ', పార్ట్ 'బి' ఉంటాయి. పరీక్షా సమయం 120 నిమిషాలుగా ఉంటుంది.

click here for notification and application link

Advertisment
తాజా కథనాలు