Floods : ఉత్తరాఖండ్ (Uttarakhand) ను భారీ వర్షాలు (Heavy Rains) ముంచెత్తుతున్నాయి. పలుచోట్ల కొండచరియలు విరిగిపోయాయి. నదులన్నీ ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణశాఖ (IMD) రెడ్ అలెర్ట్‌ను జారీ చేసింది. మరో తొమ్మిది జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హెచ్చరికలు జారీ చేసింది. గర్వాల్‌లో ఈరోజు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. దీంతో చార్‌ధామ్ యాత్ర (Char Dham Yatra) ను వాయిదా వేసినట్లు గర్వాల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే చెప్పారు. అలాగే చమోలీ జిల్లాలో బద్రీనాథ్ జాతీయ రహదారీపై పలుచోట్ల కొండచరియలు విరిగిపడంటంతో.. వాహనాల రాకపోకలపై రాష్ట్ర సర్కార్ ఆంక్షలు విధించింది.
హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు బద్రీనాథ్ ఆలయాన్ని దర్శించుకుని బైక్ తిరిగి వస్తుండగా.. ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో వీళ్లు అక్కడిక్కడే మృతి చెందారు. రాంనగర్‌లో ఓ బ్రిడ్జి కూడా కూలిపోయింది. ప్రస్తుతం రాష్ట్రంలో రెడ్ అలర్ట్ ఉన్న నేపథ్యంలో సీఎం పుష్కర్ సింగ్ ధామి.. అందరు కలెక్టర్లకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఆయా ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలని చెప్పారు.
Also Read : రాజమండ్రిలో హీటెక్కిన రాజకీయాలు.. దేవుళ్ళ మీద ప్రమాణాలు