ఇవాళ వెరీ వెరీ స్పెషల్‌ డే.. చంద్రుని కక్ష్యలోకి చంద్రయాన్‌-3.. టైమ్‌ ఎప్పుడంటే?

చంద్రయాన్‌-3కి సంబంధించి ఇవాళ(ఆగస్టు 6) కీలక పరిణామం చోటుచేసుకోనుంది. ఇస్రో జులై 14న ప్రయోగించిన చంద్రయాన్‌-3 అంతా అనుకున్నట్టుగానే చంద్రుడివైపు అడుగులేస్తోంది. ఇవాళ చంద్రుని కక్ష్యలోకి చంద్రయాన్‌-3 ఎంట్రీ ఇవ్వనుంది. జాబిల్లి కక్ష్యలోకి చంద్రయాన్‌-3 ప్రవేశించిన తర్వాత ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ (విక్రమ్) వేరు అవుతుంది.

ఇవాళ వెరీ వెరీ స్పెషల్‌ డే.. చంద్రుని కక్ష్యలోకి చంద్రయాన్‌-3.. టైమ్‌ ఎప్పుడంటే?
New Update

Chandrayaan-3 : చంద్రయాన్‌-3 నింగిలోకి దూసుకెళ్లినప్పటి నుంచి ఈ ప్రయోగం చుట్టూనే అందరి ఆలోచనలు తిరుగుతున్నాయి. చంద్రయాన్‌ ఎక్కడ వరకు వెళ్లింది.. ఎంత దూరం వెళ్లిందన్న దానిపై ప్రజలు ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ఇంటర్నెట్‌లో సమాచారం వెతుకుతున్నారు. కేవలం ఖగోళ ప్రేమికులే కాదు.. యావత్‌ దేశం చంద్రయాన్‌-3 ప్రాజెక్టు విషయంలో ఎంతో ఆసక్తిని చూపుతోంది. అలాంటి వారికి ఇదే వెరీ స్పెషల్ డే. ఇవాళ(ఆగస్టు 5) చంద్రయాన్‌-3 చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించనుంది. సాయంత్రం 7 గంటలకు చంద్రయాన్‌-3 చంద్రుని ఆర్బిట్‌లో(Moon's orbit)కి ఎంట్రీ ఇస్తుందని నేషనల్ స్పేస్ ఏజెన్సీ-ఇస్రో(ISRO) ప్రకటించింది. ఇక అన్ని అనుకున్నట్టే జరిగితే ఆగస్టు 23న చంద్రుడి ఉపరితలంపై చంద్రయాన్‌-3 'సాఫ్ట్‌ ల్యాండింగ్‌' కానుంది. ఇదే జరిగితే చంద్రుని ఉపరితలంపై ల్యాండ్‌ అయిన నాలుగో దేశంగా భారత్‌(India) అవతరిస్తుంది.

జూలై 14న చంద్రయాన్-3 ప్రయోగించినప్పటి నుంచి ఇవాళ్టి(ఆగస్టు 5)తో 22 రోజులు పూర్తవుతాయి. విక్రమ్(ల్యాండర్)ను సాఫ్ట్ ల్యాండింగ్ చేయడానికి మరో 17 రోజుల సమయం మిగిలి ఉంది. ఇప్పటి వరకు ప్రతీది ఇస్రో అనుకున్నట్టే జరిగింది. చంద్రయాన్‌-2తో కంపేర్ చేస్తే చంద్రయాన్‌-3 సేఫ్‌ ల్యాండింగ్‌కి అన్నివిధాల అనుకూలిస్తుంది. నిజానికి చంద్రయాన్‌-2లో తలెత్తిన సమస్యలు రిపీట్ అవ్వకుండా ఇస్రో చాలా జాగ్రత్త పడింది. అందుకే చంద్రయాన్‌-3(Chandrayaan-3) ప్రయోగం పూర్తిస్థాయిలో సక్సెస్‌ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఇవాళ జాబిల్లి కక్ష్యలోకి చంద్రయాన్‌-3 ప్రవేశించిన తర్వాత ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ (విక్రమ్- Vikram) వేరు అవుతుంది. ఆ తర్వాత క్రమంగా చంద్రుడి దక్షిణ ధృవంపై దిగుతుంది. 14 రోజుల పాటు అక్కడి ఫొటోలను మనకి పంపుతుంది. భూ కక్ష్య నుంచి తిరిగే ప్రక్రియ తర్వాత చంద్రయాన్-3 చంద్రునిపైకి పంపిన గంటల తర్వాత కూడా సాధారణంగా పనిచేస్తుందని ఇస్రో అంతకుముందు తెలిపింది. చంద్రయాన్‌-3 తర్వాతి కక్ష్యలోకి వెళ్లేందుకు అంతరిక్ష కేంద్రం నుంచి శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయత్నాలు విజయవంతం అవుతున్నాయని ఏజెన్సీ నాలుగు రోజుల ముందు ప్రకటించింది. అంతరిక్ష నౌక భూమికి దగ్గరగా ఉన్నప్పుడు ఈ ప్రక్రియ పూర్తయింది. ఈ ప్రక్రియ చంద్రయాన్‌-3ని 'ట్రాన్స్‌లూనార్ ఆర్బిట్'లో ఉంచుతుంది. ఈ పరీక్ష విజయవంతమైతే ఇతర గ్రహాలలో కొత్త మిషన్ల సాఫ్ట్ ల్యాండింగ్‌పై మనికి మంచి పట్టుదొరికినట్టే లెక్క. ల్యాండర్‌ ఎలా పని చేసింది, సెన్సార్‌లు, సాఫ్ట్‌వేర్, ప్రొపల్షన్ సిస్టమ్‌తో పాటు పూర్తి స్థాయి రిడెండెన్సీలపై ఓ అంచనా వేసే ఛాన్స్ ఉంటుంది. ఇది ఫ్యూచర్‌లో ఇస్రో చేయబోయే ప్రయోగాలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అందుకే చంద్రయాన్‌-3 ప్రయోగం ఇండియాకు ఎంతో ముఖ్యం. దీనిపైనే చాలా పరీక్షలు ఆధారపడి ఉంటాయి.

Also Read: కార్మికులు రాజ్‌భవన్‌ను ముట్టడిస్తారా? ఆర్టీసీ బిల్లుపై గవర్నర్‌ సంతకం చేస్తారా? ఏం జరగబోతోంది?

#chandrayaan-3 #isro #vikram #isro-missions #indian-space-research-organisation #pragyan #chandrayaan-3-nears-moon #chandrayaan-3-makes-two-thirds-of-moon-journey #chandrayaan-3-spacecraft #chandrayaan-3s-journey #chandrayaan-programme
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe