ఇవాళ వెరీ వెరీ స్పెషల్ డే.. చంద్రుని కక్ష్యలోకి చంద్రయాన్-3.. టైమ్ ఎప్పుడంటే?
చంద్రయాన్-3కి సంబంధించి ఇవాళ(ఆగస్టు 6) కీలక పరిణామం చోటుచేసుకోనుంది. ఇస్రో జులై 14న ప్రయోగించిన చంద్రయాన్-3 అంతా అనుకున్నట్టుగానే చంద్రుడివైపు అడుగులేస్తోంది. ఇవాళ చంద్రుని కక్ష్యలోకి చంద్రయాన్-3 ఎంట్రీ ఇవ్వనుంది. జాబిల్లి కక్ష్యలోకి చంద్రయాన్-3 ప్రవేశించిన తర్వాత ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ (విక్రమ్) వేరు అవుతుంది.