Chandrayaan-3 : చంద్రయాన్-3 నింగిలోకి దూసుకెళ్లినప్పటి నుంచి ఈ ప్రయోగం చుట్టూనే అందరి ఆలోచనలు తిరుగుతున్నాయి. చంద్రయాన్ ఎక్కడ వరకు వెళ్లింది.. ఎంత దూరం వెళ్లిందన్న దానిపై ప్రజలు ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ఇంటర్నెట్లో సమాచారం వెతుకుతున్నారు. కేవలం ఖగోళ ప్రేమికులే కాదు.. యావత్ దేశం చంద్రయాన్-3 ప్రాజెక్టు విషయంలో ఎంతో ఆసక్తిని చూపుతోంది. అలాంటి వారికి ఇదే వెరీ స్పెషల్ డే. ఇవాళ(ఆగస్టు 5) చంద్రయాన్-3 చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించనుంది. సాయంత్రం 7 గంటలకు చంద్రయాన్-3 చంద్రుని ఆర్బిట్లో(Moon’s orbit)కి ఎంట్రీ ఇస్తుందని నేషనల్ స్పేస్ ఏజెన్సీ-ఇస్రో(ISRO) ప్రకటించింది. ఇక అన్ని అనుకున్నట్టే జరిగితే ఆగస్టు 23న చంద్రుడి ఉపరితలంపై చంద్రయాన్-3 ‘సాఫ్ట్ ల్యాండింగ్’ కానుంది. ఇదే జరిగితే చంద్రుని ఉపరితలంపై ల్యాండ్ అయిన నాలుగో దేశంగా భారత్(India) అవతరిస్తుంది.
పూర్తిగా చదవండి..ఇవాళ వెరీ వెరీ స్పెషల్ డే.. చంద్రుని కక్ష్యలోకి చంద్రయాన్-3.. టైమ్ ఎప్పుడంటే?
చంద్రయాన్-3కి సంబంధించి ఇవాళ(ఆగస్టు 6) కీలక పరిణామం చోటుచేసుకోనుంది. ఇస్రో జులై 14న ప్రయోగించిన చంద్రయాన్-3 అంతా అనుకున్నట్టుగానే చంద్రుడివైపు అడుగులేస్తోంది. ఇవాళ చంద్రుని కక్ష్యలోకి చంద్రయాన్-3 ఎంట్రీ ఇవ్వనుంది. జాబిల్లి కక్ష్యలోకి చంద్రయాన్-3 ప్రవేశించిన తర్వాత ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ (విక్రమ్) వేరు అవుతుంది.
Translate this News: