టార్గెట్ రీచ్
ఇస్రో ( ISRO) అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 టార్గెట్‌ను అధిగమించింది. ఇప్పటివరకు ఎవరికీ తెలియని అంశాలను భూమికి చేరవేసింది. ప్రస్తుతం చంద్రుడిపై రాత్రి కావడంతో విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ స్లీప్ మోడ్‌లోకి వెళ్లిపోయాయి. ఐతే చంద్రుడిపై విక్రమ్ ల్యాండైన ప్రదేశాన్ని గుర్తిస్తూ ఫొటోలు విడుదల చేసింది US స్పేస్ ఏజెన్సీ నాసా( NASA). జాబిల్లిపై సౌత్ పోల్‌కు 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న ల్యాండర్ చిత్రాలను రిలీజ్ చేసింది.
Chandrayaan-3 observed by NASA’s LRO: LRO కెమెరాతో ఫోటో
విక్రమ్ ల్యాండర్‌ను (Vikram Lander) 42 డిగ్రీల కోణంలో LRO కెమెరా ఈ ఫోటో(Photo) తీసినట్లు వెల్లడించింది నాసా. మేరీల్యాండ్‌లోని గ్రీన్‌బెల్ట్‌లో ఉన్న గోడార్డ్ స్పేస్ ఫ్లయిట్ సెంటర్ (Goddard Space Flight Center) నుంచి LRO కెమెరాలను మేనేజ్ చేస్తోంది నాసా. చంద్రుడి కక్ష్యలో తిరుగుతున్న ఈ లూనార్ రికనైసెన్స్ ఆర్బిటర్ కెమెరా.. ఇటీవలే రష్యా ప్రయోగించిన లూనా 25 ఫోటోలను కూడా పంపింది.
Also Read: భూమి, చంద్రుడితో ఆదిత్య ఎల్-1 సెల్ఫీలు.. వీడియో చూడాల్సిందే భయ్యా!
మరింత స్పష్టంగా చూడగలం
మరోవైపు చంద్రయాన్-3 మిషన్‌కు సంబంధించి ఆసక్తికర విషయాల్ని పంచుకుంటున్న ఇస్రో..రెండ్రోజుల క్రితం చంద్రుడి ఉపరితలం 3D అనాగ్లిఫ్ ఫొటోలను రిలీజ్ (Release photos) చేసింది. పేలోడ్‌గా పంపించిన నావిగేషన్ కెమెరా వీటిని తీసింది. ఈ ఫొటోలను స్టీరియో ఎఫెక్ట్‌లోకి మార్చింది ఇస్రో. మల్టీ వ్యూ ఇమేజ్‌లను ఒకచోట చేర్చి మూడు కోణాల్లో కనిపించేలా చేయటమే ‘అనాగ్లిఫ్'. విక్రమ్ ల్యాండర్ ఉన్న ప్రాంతంలో చంద్రుడి ఉపరితలం ఎలా ఉందో త్రీడీ చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఫొటోలు ఎరుపు, నీలం, ఆకుపచ్చ మిశ్రమంలో కనిపిస్తున్నాయి. రెడ్ అండ్ సియాన్ కలర్ గ్లాసెస్‌ను వాడితే మరింత స్పష్టంగా చూడగలమని తెలిపింది ఇస్రో.
తొలి దేశంగా భారత్
చంద్రయాన్ -3 ప్రయోగంతో చంద్రుడిపై దక్షిణ ధృవంలో స్పేస్ క్రాఫ్ట్‌ను సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన తొలి దేశంగా భారత్ అవతరించింది. అంతేకాకుండా అమెరికా, సోవియట్ యూనియన్, చైనాలతోపాటు చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన నాలుగో దేశంగా నిలిచింది.
Also Read: జీ20 సమావేశాలు జరిగే భారత్ మండపం స్పెషాలిటీ ఏంటి? వైరల్ ఫొటోలు, వీడిమోలు!