AP Elections 2024: అకౌంట్స్‌ అన్నీ సెటిల్‌ చేస్తాం.. జగన్ కు చంద్రబాబు వార్నింగ్!

ఏపీ సీఎం జగన్ స్కీముల్లో కూడా స్కాములు చేసే వ్యక్తి అంటూ చంద్రబాబు ఆరోపించారు. పెనుకొండలో నిర్వహించిన 'రా.. కదలిరా' సభలో వైసీపీ నాయకుల అకౌంట్స్‌ అన్నీ సెటిల్‌ చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. ఏపీని రక్షించుకునేందుకే టీడీపీ-జనసేన కలిశాయన్నారు.

New Update
AP Elections 2024: అకౌంట్స్‌ అన్నీ సెటిల్‌ చేస్తాం.. జగన్ కు చంద్రబాబు వార్నింగ్!

Chandrababu in Ra Kadali Ra Sabha: ఏపీ సీఎం జగన్ (CM Jagan) సర్కార్ పై టీడీపీ నాయకుడు చంద్రబాబు సంచలన కామెంట్స్ చేశారు. జగన్ స్కీముల్లో కూడా స్కాములు చేసే వ్యక్తి అంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు పెనుకొండలో నిర్వహించిన 'రా.. కదలిరా' నిర్వహించిన సభలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ నాయకుల అకౌంట్స్‌ అన్నీ సెటిల్‌ చేస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు స్వార్థం కోసం టీడీపీ-జనసేన (TDP-Janasena) కలవలేదని, ఏపీని రక్షించుకునేందుకే జతకట్టామని ఆయన తెలిపారు.

విధ్వంసం చేసిన వ్యక్తిని ఇంటికి పంపాలి..
ఈ మేరకు బాబు (Chandrababu) మాట్లాడుతూ.. ఏది అభివృద్ధో? ఏది దోపిడో. గుర్తించి వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఓటేయాలని పిలుపునిచ్చారు. ‘సాగునీరు ఇస్తే చాలు.. రాయలసీమ రైతులు బంగారం పండిస్తారు. అనంతపురం జిల్లా అంటే నాకు ఎంతో ఇష్టం. అత్యంత తక్కువ వర్షపాతం ఉన్నది ఇక్కడే. కరవు జిల్లాను సస్యశ్యామలం చేయాలని టీడీపీ హయాంలో సంకల్పించాం. కియా పరిశ్రమ తెచ్చి వేలమందికి ఉపాధి కల్పించాను. గొల్లపల్లి రిజర్వాయర్‌ను 18 నెలల్లో కంప్లీట్ చేశాం. కియాలో ఇప్పటివరకు 12 లక్షల కార్లు తయారయ్యాయి. దీని వల్ల ప్రత్యక్ష, పరోక్షంగా 50 వేల మందికి ఉద్యోగాలు దొరికాయి. అనంతపురం జిల్లాలో బిందు, తుంపర సేద్యం మరింత పెరగాలి. 2014లో ఈ ప్రాంతం ఎలా ఉంది.. ఇప్పుడెలా ఉంది? మేం అధికారంలో ఉంటే సాగునీరు, పెట్టుబడులు, ఉపాధి పెరిగేవి. అహంకారంతో రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన వ్యక్తిని ఇంటికి పంపాలి' అని అన్నారు.

ఇది కూడా చదవండి: Balakrishna: జగన్ ఇందుకు సిద్ధంగా ఉన్నావా?: బాలకృష్ణ

మా పార్టీతో పోల్చుకోవద్దు.. 
అలాగే ఇప్పటివరకూ రాయలసీమకు తెచ్చిన పెట్టుబడులు ఏమిటో జగన్‌ చెప్పాలని బాబు డిమాండ్ చేశారు. ఈ ఐదేళ్లలో ఏదైనా ప్రాజెక్టు నిర్మించారా? రాయలసీమకు ఏ పార్టీ మేలు చేసిందో ప్రజలు గ్రహించాలి. అభివృద్ధిలో మా పార్టీతో పోల్చుకోవద్దని జగన్‌ను కోరుతున్నామన్నారు. ఇక 5ఏళ్లలో ఒక్కరికైనా ఉద్యోగం వచ్చిందా? అని ప్రశ్నించారు. అన్నీ తాను ఇచ్చిన ఐటీ ఉద్యోగాలేనని జగన్‌ ఇచ్చింది కేవలం వాలంటీర్ ఉద్యోగాలు మాత్రమే అన్నారు. టీడీపీ - జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాలంటీర్‌ వ్యవస్థ ఉంటుంది. ఎవరి ఉద్యోగం తీసేయం. వాలంటీర్లకు మంచి భవిష్యత్తు ఉంటుంది. అందరికీ న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

Advertisment
తాజా కథనాలు