/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/cbn-janasena-alliance-jpg.webp)
TDP - Janasena Alliance : ఏపీ(AP) లో పొత్తు రాజకీయాలు హాట్ టాపిక్‌గా మారాయి. జనసేన-టీడీపీ(Janasena-TDP) సీట్ల వ్యవహారం మరికాసేపట్లోనే ఓ కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. చంద్రబాబుతో పవన్ భేటీ కావడం చర్చనీయాంశమవుతోంది. ఇటీవలి కాలంలో చంద్రబాబు, పవన్ భేటీ అవ్వడం ఇది మూడోసారి. సీట్ల సర్దుబాటు, మేనిఫెస్టోపై చర్చిస్తున్నారు. భేటీ తర్వాత మీడియా ముందుకు చంద్రబాబు, పవన్ రానున్నారని తెలుస్తోంది. పవన్‌తో భేటీ అనంతరం టీడీఎల్పీ(TDLP) సమావేశం కానుంది. రేపటి అసెంబ్లీ సమావేశాల్లో(Assembly Meeting) అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా చర్చ జరగనుంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-04-at-1.04.50-PM-jpeg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-04-at-1.04.50-PM-1-jpeg.webp)
35 ఇస్తారా?
35 సీట్లు మాత్రమే జనసేనకు ఇస్తామని చంద్రబాబు చెబుతున్నట్టుగా సమాచారం. అయితే తనకు మరిన్ని సీట్లు కావాలని పవన్ అడుగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో తమకు ఎక్కువ సీట్టు ఇవ్వాలని జనసేన పట్టుపడుతున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు జనసేనతోనే కలిసి పొత్తులో ఉన్న బీజేపీ గురించి ఊసే లేకపోవడాన్ని ఇక్కడ గమనించాల్సి ఉంటుంది.
రేపటి నుంచి సమావేశాలు:
ఫిబ్రవరి 5న గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పూర్తి బడ్జెట్‌కు బదులుగా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్(Vote On Account Budget) మాత్రమే ప్రవేశపెడతారు. అసెంబ్లి సమావేశాలు మూడు రోజుల పాటు జరగనుండగా, ఎన్నికల కారణంగా సమయాభావం ఏర్పడింది. ఈ సమావేశాల్లో రాష్ట్ర భవిష్యత్తును రూపొందించే కీలకమైన చర్చలు, నిర్ణయాలు తీసుకోవచ్చని భావిస్తున్నారు.
Also Read: రాజకీయాల్లో హుందాతనం లేదు.. సన్మాన వేదికపై ఇచ్చిపడేసిన చిరు
WATCH:
Follow Us