Hanuma Vihari: కెప్టెన్సీ నుంచి హనుమ విహారి నిష్క్రమణ.. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ఫైర్‌..

ఏపీ క్రికెట్‌ అసోసియేషన్‌ నుంచి భారత క్రికెటర్‌ హనుమ విహారి తప్పుకోవడంపై విపక్ష నేతలైన చంద్రబాబు, లోకేష్, పవన్‌ కల్యాణ్‌లు స్పందించారు. వైసీపీ రాజకీయాలకు ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్ లొంగిపోవడంపై విమర్శలు చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకి ఆయన్ని ఆహ్వానిస్తామని తెలిపారు.

Hanuma Vihari: కెప్టెన్సీ నుంచి హనుమ విహారి నిష్క్రమణ.. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ఫైర్‌..
New Update

Chandrababu and Pawan Kalyan On Hanuma Vihari Issue: ఆంధ్రప్రదేశ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ నుంచి భారత క్రికెటర్‌ హనుమ విహారి శాశ్వతంగా తప్పుకోవడం హాట్‌ టాపిక్‌గా మారింది. ఇక భవిష్యత్‌లో ఆంధ్ర క్రికెట్‌ (Andhra Cricket) తరఫున నుంచి ఆడనని ఆయన తేల్చి చెప్పారు. ఆంధ్ర క్రికెట్‌ సంఘంలో రాజకీయ జోక్యం ఎక్కువైపోయిందని అన్నారు. రాష్ట్రంలో అధికార పార్టీకి చెందిన ఓ రాజకీయ నేత కొడుకు కోసం తనను కెప్టెన్సీ నుంచి తప్పించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మాభిమానం దెబ్బతిన్న చోట తాను ఉండలేనని చెప్పాడు హనుమ విహారి. అయితే ఈ అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu), ఆయన కొడుకు లోకేశ్‌, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan) స్పందించారు. వైసీపీ పార్టీపై, సీఎం జగన్‌పై తీవ్రంగా విమర్శలు చేశారు.

Also Read: లండన్‌లో కూతురుతో విరాట్ కోహ్లీ… వైరల్ అవుతున్న ఫోటో

ఇది అన్యాయం

వైసీపీ (YSRCP) ప్రతికార రాజకీయాలకు ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్ కూడా లొంగిపోవడం సిగ్గుచేటంటూ చంద్రబాబు విమర్శలు చేశారు. హనుమ విహారి టాలెంటెడ్‌ భారతీయ అంతర్జాతీయ క్రికెటర్‌ అని.. ఆయన ఆంధ్రప్రదేశ్‌ తరఫున ఆడబోనని ప్రమాణం చేసే స్థాయికి తీసుకువచ్చారంటూ మండిపడ్డారు. ఇలాంటి అన్యాయమైన చర్యలు.. ఏపీ ప్రజల నిజమైన స్పూర్తిని ప్రతిబింబించవని పేర్కొన్నారు. హనుమ విహారికి (Hanuma Vihari) న్యాయం జరిగేలా చూస్తామని.. మా ప్రభుత్వం వచ్చాక విహారికి రెడ్‌కార్పెట్‌తో స్వాగతం పలుకుతామని పేర్కొన్నారు.

కోట్లు ఖర్చు పెట్టడం దేనికి

అధికార పార్టీ జోక్యంతో ప్రముఖ క్రికెటర్‌ హనుమ విహారిని కెప్టెన్సీ నుంచి తప్పించడంపై తాను ఆశ్చర్యపోయానని.. నారా లోకేశ్ (Nara Lokesh) అన్నారు. రెండు నెలల్లోనే ఆంధ్రప్రదేశ్‌ తరఫున ఆడేందుకు తాను ఆహ్వానిస్తాని చెప్పారు. ఇక మరోవైపు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సైతం తీవ్రంగా స్పందించారు. ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌కు భారత క్రికెటర్, ఆంధ్ర రంజీ టీమ్ కెప్టెన్‌ కంటే.. స్థానిక వైసీపీ నేతనే ముఖ్యమైపోయిందని విమర్శించారు. ఇది సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర క్రికెట్‌ సంఘం.. ఆంధ్ర క్రికెట్‌ కెప్టెన్‌ను అవమానపరిచినప్పుడు.. ఆడుదాం ఆంధ్ర లాంటి వేడుకల కోసం వేల కోట్లు ఖర్చు చేయడం దేనికి అంటూ సీఎం జగన్‌ను నిలదీశారు. తాము హనుమ విహారికి అండగా ఉంటామని తెలిపారు. ఏపీసీసీ చీఫ్‌ షర్మిల కూడా దీనిపై స్పందించారు. రాష్ట్ర గౌరవాన్ని వైసీపీ అన్ని విధాలుగా నాశనం చేసిందని.. ఇప్పుడు క్రీడల పైనా కూడా రాజకీయ కుట్రలు చేస్తారా అంటూ తీవ్రంగా విమర్శించారు.

Also Read: ‘నువ్వు ఇంతకన్నా ఏం పీకలేవ్‌..’ సింపతి గేమ్స్‌ వద్దు విహారీ..!

#telugu-news #cricket-news #hanuma-vihari #andhra-cricket-association #hanuma-vihari-vs-prudhvi-raj
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe