Chandrababu: కూటమి శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు

AP: టీడీపీ శాసనసభాపక్ష నేతగా చంద్రబాబును ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. చంద్రబాబు పేరును అచ్చెన్నాయుడు ప్రతిపాదించారు. దీనికి టీడీపీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. అలాగే ఎన్డీయే కూటమి తరఫున సభానాయకుడిగా చంద్రబాబు పేరును పవన్ ప్రతిపాదించారు.

New Update
CM Chandrababu: రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. అమిత్ షాతో కీలక భేటీ!

Vijayawada : విజయవాడలోని A కన్వేషన్ లో కూటమి నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి చంద్రబాబు (Chandrababu), పవన కళ్యాణ్ (Pawan Kalyan), పురంధేశ్వరి, కూటమి ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు హరజరయ్యారు. టీడీపీ (TDP) శాసనసభాపక్ష నేతగా చంద్రబాబును ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. చంద్రబాబు పేరును అచ్చెన్నాయుడు ప్రతిపాదించారు. దీనికి టీడీపీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. అలాగే ఎన్డీయే కూటమి తరఫున సభానాయకుడిగా చంద్రబాబు పేరును పవన్ ప్రతిపాదించారు.

రాష్ట్రం నలిగిపోయింది: పవన్ కళ్యాణ్

రాష్ట్రవిభజన నుంచి ఏపీ ప్రజలు నలిగిపోయారని అన్నారు పవన్ కళ్యాణ్. గత ఐదేళ్లుగా రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. అందరి పోరాటం వల్లే ఈ అద్భుత విజయం సాధించినట్లు చెప్పారు. ఇది కక్ష సాధింపు చర్యలకు సమాయం కాదని.. ఏపీని పునర్నిర్మించుకునే సమయం అని పేర్కొన్నారు.  ఇది ఐదు కోట్ల ప్రజలు మనపై పెట్టుకున్న నమ్మకం అని అన్నారు. వారికి నమ్మకాన్ని, ఎన్నికల సమయం ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా మన ప్రభుత్వం అడుగు వేయాలని తెలిపారు. ఉమ్మడి మేనిఫెస్టోను ముందు తీసుకెళ్తామని అన్నారు.  సంక్షేమానికి దూరమై సంక్షోభంలో ఉన్న ఏపీ (Andhra Pradesh) ని అభివృద్ధి బాటలో అందరం కలిసి ముందుకు తీసుకెళ్లని అన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు