CHANDRABABU:నేడు హైకోర్టులో చంద్రబాబు ఇన్నర్ రింగ్ రోడ్ కేసు విచారణ

ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై నేడు ఏపి హై కోర్టులో విచారణ జరగనుంది. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ లో చంద్రబాబు అక్రమాలకు పాల్పడ్డారని సీఐడీ కేసు నమోదు చేసింది. గత విచారణలో హైకోర్టు బాబును ఈరోజు వరకు అరెస్టు చేయవద్దని ఆదేశించింది.

New Update
CHANDRABABU:నేడు హైకోర్టులో చంద్రబాబు ఇన్నర్ రింగ్ రోడ్ కేసు విచారణ

నేడు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో బెయిల్ పిటిషన్ పై మరోసారి ఏపీ హైకోర్టు విచారించనుంది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు A1 గా ఉన్నారు. దాంతో పాటూ అసైన్డ్ భూముల కేసులో కూడా హైకోర్టు ఈరోజు తీర్పును ఇవ్వనుంది. రాజధాని గ్రామాల పరిధిలో అసైన్డ్ భూములు సేకరణలో బాబు, మాజీ మంత్రి నారాయణ అక్రమాలకు పాల్పడ్డారని సీఐడీ 2021లో కేసు నమోదు చేసింది. దీని మీద ఇప్పటికే విచారణ ముగిసింది. దీని కోర్టు నేడు తీర్పును వెలువరించాల్సి ఉన్న నేపథ్యంలో కేసును రీ ఓపెన్ చేయాలని సీఐడీ కొత్తగా రెండు పిటిషన్లను దాఖలు చేసింది. అయితే ఈరోజు హైకోర్టులో పిటిషన్లను విచారిస్తారా లేక ఇప్పటికే విచారణ ముగిసిన నేపథ్యంలో తీర్పును వెలువరిస్తారన్న దానిపై ఉత్కంఠత నెలకొంది. అసైన్డ్ భూముల విషయంలో తాము ఎలాంటి అక్రమాలకూ పాల్పడలేదని పేర్కొంటూ ఈ కేసును కొట్టేయాలని గతంలోనే కోర్టులో నారాయణ,చంద్రబాబు పిటిషన్లు వేశారు.

Also Read:హమాస్ తో మాకు ఏమీ సంబంధం లేదు…పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్

మరోవైపు రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు రిమాండ్ ఖైదీగా 37వ రోజు కొనసాగుతున్నారు. ఆయన ఆరోగ్యం మీద ఆందోళన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో నిన్న బాబు ఆరోగ్యానికి సంబంధించి బులెటిన్ విడుదల చేశారు అధికారులు. బాబు ఆరోగ్య పరిస్థితిపై 4 రోజులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు సెంట్రల్ జైల్ ఇన్‌చార్జి సూపరింటెండ్ రాజ్ కుమార్. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించారు. ఇక ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు జైలులో టవర్ ఏసీ ఏర్పాటు చేశారు అధికారులు.

Also Read:తెలంగాణ బీజెపీ నేత సత్యవతి హఠాన్మరణం

Advertisment
తాజా కథనాలు