Chandra Babu Got Bail: టీడీపీ అధినేత చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. స్కిల్ స్కాం కేసులో తనకు బెయిల్ కావాలంటూ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన ధర్మాసనం ఈరోజు తీర్పు వెల్లడించింది. విచారణలో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ తీర్పును వెలువరించింది.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో భాగంగా చంద్రబాబును ఆగస్టు 9న ఏపీ సీఐడీ అరెస్ట్ చేసింది. దాదాపు 52రోజులపాటు రాజమండ్రి జైలులో ఉన్నారు చంద్రబాబు. అక్టోబర్ 31న అనారోగ్య సమస్యల కారణంగా నాలుగు వరాల షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది హైకోర్టు. ప్రస్తుతం చంద్రబాబు మధ్యంతర బెయిల్ పై బయట ఉన్నారు.
తాజాగా చంద్రబాబు లాయర్లతో ఏకీభవించిన ఏపీ హైకోర్టు ఈ కేసులో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ ను మంజూరు చేసింది. ఈ నెల 30న ఏసీబీ కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది.