17ఏ మీద మాజీ సీఎం చంద్రబాబు దాఖలు చేసిన పిల్ మీద తీర్పు పెండింగ్‌లో ఉంది. ఫైబర్నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టు తిరస్కరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు చంద్రబాబు. దీని మీ ఇవాళ సుప్రీంకోర్టులో జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ బేలా ఎం. త్రివేది ధర్మాసనం విచారణ చేయనున్నారు. కోర్ట్ నంబర్ 6లో ఐటమ్ నంబర్ 11 గా చంద్రబాబు కేసు లిస్ట్ అయింది. ఏపీ ఫైబర్ నెట్ కేసులో అక్టోబర్ 9న చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు తిరస్కరించింది. ఫైబర్ నెట్ కేసులో దర్యాప్తు కీలక దశలో ఉన్నందున బెయిలు ఇచ్చేందుకు నిరాకరించింది ఏపీ హైకోర్టు.
Also Read:ఇల్లందులో బీఆర్ఎస్ కు షాక్..మున్సిపల్ చైర్మన్ రాజీనామా
అయితే, చంద్రబాబును 17-ఎ కేసులో తీర్పు చెప్పేవరకూ ఫైబర్‌నెట్ కేసులో అరెస్టు చేయడం కానీ, ట్రయల్ కోర్టు ముందు హాజరుపరచడం కానీ చేయొద్దని సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. 17-ఏ కేసులో ఇప్పటి వరకు తీర్పును చెప్పలేదు. ఇవాళ్టి జాబితాలోనూ అది లిస్ట్ కాలేదు. దీంతో నేడు ఫైబర్‌నెట్ కేసులో ముందస్తు బెయిల్ అంశంపై తీర్పు చెబుతారా. ..లేదా మళ్ళీ వాయిదా వేస్తారా అనే ప్రశ్న తలెత్తుతోంది. లేదంటే 17-ఎ కేసులో తీర్పు ఇచ్చే వరకూ ప్రస్తుతమున్న ఆదేశాలను కొనసాగిస్తారా అనేదానిలో సందేహం నెలకొంది.
ఇన్నర్ రింగ్ కేసులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేశారు. నిన్న దాని మీద ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్ మీద ఇంతకు ముందు కూడా విచారణ జరిగింది. అప్పుడు చంద్రబాబుకు ఇవాల్టి వరకు అంటే నవంబర్ 7వరకు అరెస్ట్ చేయ్యదని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది హైకోర్టు. విచారణ దశలో ఉన్న పిటి వారెంట్ పై ఇవాళ్టి వరకు హైకోర్టు స్టే ఇచ్చింది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో విచారణకు బాబు సహకరిస్తారని గత విచారణలో చంద్రబాబు తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో మధ్యంతర ఉత్తర్వుల సమయం నిన్నటితో ముగిసింది. వాదనల అనంతరం ఈ కేసును కోర్టు ఈ నెల 22కు వాయిదా వేసింది.
Also Read:ఐటీ దిగ్బంధంలో పొంగులేటి.. నామినేషన్ వేస్తారా.. లేదా..?