AP Politics: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu) రాష్ట్ర రాజకీయాలపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. తన కేసులకు సంబంధించి హైకోర్టుల్లో వాదనలు వినిపిస్తున్న సిద్దార్థ లూథ్రా (Siddhartha Luthra) కుమారుడి పెళ్లి రిసెప్షన్‌కు తన సతీమణి భువనేశ్వరితో (Bhuvaneshwari) కలిసి చంద్రబాబు హాజరు అయ్యారు.
ALSO READ: మందు బాబులకు ALERT.. రేపటి నుండి వైన్స్ బంద్!
ఈ నెల 30న చంద్రబాబు తిరుమలకు వెళ్లనున్నారు. డిసెంబర్ 1న ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని చంద్రబాబు దర్శించుకోనున్నారు. అనంతరం అదే రోజు అమరావతి వెళ్లనున్నారు. తర్వాత రోజుల్లో విజయవాడ దుర్గమ్మను చంద్రబాబు దర్శించుకోనున్నారు. దాంతో పాటు సింహాచలం అప్పన్న, శ్రీశైలం మల్లన్న దర్శనానికి కూడా వెళ్లనున్నారు. డిసెంబర్ మొదటి వారంలో పూర్తిస్థాయి రాజకీయ కార్యక్రమాలలో చంద్రబాబు పాల్గొననున్నారు.
ఇదిలా ఉండగా ఈరోజు మద్యం కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు తరఫున లాయర్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈరోజు ఏపీ ఆ పిటిషన్ ను విచారించింది. విచారణ అనంతరం తీర్పును రిజర్వ్ చేసింది. తదుపరి ఆదేశాల వరకు చంద్రబాబుపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సీఐడీని ఆదేశించింది. గతంలో ఇచ్చిన ఆదేశాలే అమల్లో ఉంటాయని పేర్కొంది.
రేపు స్కిల్ స్కాం కేసులో చంద్రబాబుకు ఇచ్చిన బెయిల్ పిటిషన్ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ పై రేపు సుప్రీం కోర్టులో విచారణ జరుగనుంది. ఇటీవల స్కిల్ స్కాం కేసులో చంద్రబాబుకు రెగ్యులర్ బేయిల్ ను మంజూరు చేసింది ఏపీ హైకోర్టు.
ALSO READ: పెన్షన్ రూ.5000.. కేసీఆర్ సంచలన ప్రకటన!