Chalamala Krishna Reddy: తెలంగాణ పగ్గాలను చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీలో కొత్త పంచాయతీ తెర మీదికి వచ్చింది. తెలంగాణ ఎన్నికల సమయంలో టికెట్ రాలేదు అని కాంగ్రెస్ ను విడిచి బీజేపీలో చేరిన మునుగోడు నేత చలమల కృష్ణా రెడ్డి తాజాగా తిరిగి కాంగ్రెస్ లో చేరారు. ఇప్పుడు కాంగ్రెస్ లో చలమల కృష్ణా రెడ్డి చేరికపై గందరగోళం నెలకొంది. చలమల చేరికను కొందరు కాంగ్రెస్ నేతలు వ్యతిరేకిస్తున్నారు.
తాజాగా చలమల చేరిక చెల్లదని యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు అందెం సంజీవ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఓ ప్రకటన రిలీజ్ చేశారు. చలమల చేరిక సమాచారం కాంగ్రెస్ నేతలకు తెలియదని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా చలమల కుట్రలు చేశారని ఆరోపణలు చేశారు. అక్రమ దందాలు కొనసాగించడంతో పాటు ఆస్తులు కాపాడుకునేందుకే కాంగ్రెస్‌లో చేరిక డ్రామా అని అన్నారు.
ALSO READ: విద్యార్థులు ఎందుకు చనిపోతున్నారు.. ఎమ్మెల్సీ కవిత ప్రశ్నలు
రాజ్ గోపాల్ రెడ్డి సీరియస్..
చలమల కృష్ణా రెడ్డి ని కాంగ్రెస్‌లో చేర్చుకోవడంపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చలమల కృష్ణారెడ్డి తనకు తెలియకుండా పార్టీలో చేరారని మండిపడ్డారు. తన మీద ఇష్టం వచ్చినట్లు చలమల ఆరోపణలు చేశారని ఫైర్ అయ్యారు. తన వల్ల పార్టీకి లాభం అవుతుందనే తనను పార్టీలోకి పిలిచారని కాంగ్రెస్ హైకమాండ్ పై సీరియస్ అయ్యారు. తనను పార్టీలో చేరమని కాంగ్రెస్ పెద్దలు కోరితేనే పార్టీలో చేరినట్లు తెలిపారు. చలమల డబ్బులతో రాజకీయం చేద్దాం అనుకున్నాడని విమర్శలు చేశారు. చలమల జాయినింగ్ చెల్లదని అన్నారు. చలమల వ్యక్తిత్వం లేని మనిషి..రాజకీయాలకు పనికి రాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌కు 10 పార్లమెంట్ స్థానాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
ALSO READ: కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే.. మాజీ మంత్రి నిరంజన్ కీలక వ్యాఖ్యలు
DO WATCH: