USA : సీఈఓ ప్రాణాలు తీసిన టెస్లా కార్... అమెరికాలో ఘటన

ఎలక్ట్రిక్ కార్లలో సంచలనం టెస్లా కార్స్. ప్రపంచ వ్యాప్తంగా ఈ కార్లకు ఫుల్ క్రేజ్ ఉంది. అయితే ఈ టెస్లా కార్లలో చాలా ప్రాబ్లెమ్స్ వస్తున్నాయి. దీని వలన డ్రైవర్లు కన్ఫ్యూజన్ కూడా అవుతున్నారు. రీసెంట్‌గా టెస్లా కార్‌ వల్ల అమెరికాలోని పెద్ద కంపెనీ సీఈఓ ప్రాణాలు పోగొట్టుకున్నారు.

USA : సీఈఓ ప్రాణాలు తీసిన టెస్లా కార్... అమెరికాలో ఘటన
New Update

Tesla Car : ఎలాన్ మస్క్‌(Elon Musk) కు చెందిన టెస్లా కార్లు(Tesla Cars) ఫుల్ ఫేమస్ అయ్యాయి. ఈ ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ కార్లు(Automatic Electric Cars) డైవ్ చేయకపోయినా వెళ్ళవచ్చును. అయితే ఈ మధ్య ఈ కార్లలో చాలా లోపాలు తలెత్తుతున్నాయి. రీసెంట్‌గా 2 లక్షల కార్లను టెస్లా(Tesla) సంస్థ రీకాల్ చేసింది. కారు రివర్స్ బ్యాకప్ కెమెరా పని చేయకపోవడమే ఇందుకు కారణమని చెప్పింది. టెక్నికల్‌గా టెస్లా కారు చాలా బావున్న మాట వాస్తవమే కానీ దీని వల్ల జనాలుచాలా కన్ఫూజ్ అయిపోతున్నారు. ఇది పెద్ద పెద్ద ప్రమాదాలకు దారి తీస్తోంది. రీసెంట్‌గా టెస్లా కారు వల్ల అమెరికాలో ఓ ప్రముఖ కంపెనీ సీఈఓ తన ప్రాణాలను పోగొట్టుకున్నారు.

చావుకు దారి తీసిన రివర్స్ గేర్..
ఏంజెలా చావో... ప్రముఖ షిప్పింగ్‌ కంపెనీ ఫార్‌మోస్ట్‌ గ్రూప్‌‌ సీఈవో. ఈమె అమెరికా(America) లోనా ఆస్టిన్‌లో ఉంటారు. రీసెంట్‌గా చైనా న్యూ ఇయర్ జరిగింది. దీని సెలబ్రేషన్స్ కోసం ఏంజెలా తన స్నేహితులతో కలిసి టెక్సాస్‌లోని ఆస్టిన్‌లో ఉన్న తన ఫామ్ హౌస్‌కు వెళ్లారు. ఈ ఇల్లు మిల్లర్ సెలయేరుకు పక్కనే ఉంది. రోజంతా ఆనందంగా తన ఫ్రెండ్స్‌తో గడిపారు ఏంజెలా. తరువాత రాత్రి అక్కడ నుంచి ఓ రెస్టారెంట్‌కు వెళ్లారు. అక్కడ డిన్నర్ చేసి తిరిగి వస్తుండగా ప్రమాదంలో చిక్కుకున్నారు ఏంజెలా. వస్తున్న దారిలో ఒక చోట త్రీ పాయింట్ టర్న్ ఉంది. దానిని క్రాస్ చేయడానికి ఆమె గేర్ మార్చబోయి పొరబాటున రివర్స్ గేర్ వేసేశారు. అంతే ఏంజెలా నడుపుతున్న టెస్లా ఎక్స్ ఎస్‌యూవీ వేగంగా వెనక్కు వెళ్ళి పక్కనే ఉన్న మిల్లర్ చెరువులో పడిపోయింది. అది కూడా బోల్తా పడింది.

షాక్‌ కొడుతుందేమో అని భయపడ్డారు..
ప్రమాదం జరిగినప్పుడు ఏంజెలాకు ఏమీ కాలేదు. నీటిలో పడిన వెంటనే ఆమె తన స్నేహితురాలికి ఫోన్‌ కూడా చేశారు. అయితే కారు నుంచి మాత్రం బయటకు రాలేకపోయారు. ఈలోపు కారు చెరువులో బోల్తా పడడం వలన వేగంగా నీటిలో మునిగిపోయింది. ఏంజెలా స్నేహితురాలు, పోలీసులు వచ్చే లోపు జరగవలసిన ఘోరం జరిగిపోయింది. స్నేహితురాలు, గెస్ట్ హౌస్ మేనేజర్‌, పోలీసులు అక్కడికి చేరుకొని ఏంజెలాను రక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ టెస్లాకారులోని విండో డోర్ అత్యంత బలంగా ఉండడంతో.. దానిని బద్దలు కొట్టడం అసాధ్యం అయింది. దీనికి కారు ఎలక్ట్రిక్ అవడం...అది నీటిలో ఉండడంతో.. షాక్‌ కొడుతుందేమోనని కూడా భయపడిపోయారు. చివరకు అతికష్టమ్మీద మరో వాహనం సాయంతో కారును నీటి బయటకు తీసారు.. కానీ అప్పటికే ఏంజెలా చనిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read : Byjus: మూతబడ్డ బైజూస్ ఆఫీసులు.. ఇంటి నుంచే ఉద్యోగులకు పని

#accident #elon-musk #usa #tesla-car #angela-chao
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe