Masala: మసాల దినుసుల్లో క్యాన్సర్ కారకాలు.. కేంద్రం కీలక నిర్ణయం ఎవరెస్ట్, మహాసియన్ ది హట్టి ప్రైవేట్ లిమిటెడ్(ఎండీహెచ్) కంపెనీలు తయారు చేసిన మసాల దినుసుల్లో క్యాన్సర్ కారకాలు ఉన్నట్లు బయటపడటంతో వాటిని నిషేధిస్తున్నట్లు హాంకాంగ్, సంగాపూర్ దేశాలు ప్రకటించాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ కంపెనీలపై చర్యలకు సిద్ధమైంది. By B Aravind 22 Apr 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Cancer Causing Chemicals in MDH And Everest Masala: ఎవరెస్ట్, మహాసియన్ ది హట్టి ప్రైవేట్ లిమిటెడ్(ఎండీహెచ్) కంపెనీలు తయారు చేసిన మసాల దినుసుల్లో క్యాన్సర్ కారకాలు ఉన్నట్లు బయటపడటంతో వాటిని తమ దేశంలో నిషేధిస్తున్నట్లు హాంకాంగ్ (Hong Kong), సంగాపూర్ (Singapore) దేశాలు ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భారత్‌కు చెందిన ఈ రెండు మసాల దినుసుల తయారీ కంపెనీలపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఇందుకోసం ముందుగా ఎండీహెచ్ (MDH), ఎవరెస్ట్‌కు (Everest) చెందిన అన్ని మసాలా దినుసుల తయారీ యూనిట్ల నుంచి నమూనాలను సేకరించాలని కేంద్రం.. ఫుడ్ కమిషనర్‌లకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. Also Read: పసుపు బోర్డు ఏర్పాటులో నిజామాబాద్ పేరు లేదు: సీఎం రేవంత్ దేశంలో ఫుడ్ కమిషనర్లందరినీ అప్రమత్తం చేశామని.. మసాలా దినుసుల నమునాల సేకరణ ప్రక్రియ ప్రారంభమైనట్లు ప్రభుత్వ ఉన్నత వర్గాలు తెలిపాయి. ఉత్తర్వులు కూడా ఇచ్చామని.. మూడు నాలుగు రోజుల్లో దేశంలో అన్ని మసాల దినుసుల తయారీ యునిట్ల నుంచి శాంపుల్స్‌ను సేకరిస్తున్నట్లు పేర్కొన్నాయి. అధికారు కేవలం ఎండీహెచ్, ఎవరెస్ట్ మాత్రమే కాకుండా అన్ని మసాల తయారీ కంపెనీల నుంచి శాంపుల్స్‌ని తీసుకుంటారని చెప్పాయి. నమునాలను పరీక్ష చేసిన తర్వాత 20 రోజుల్లో ఫలితాలు విడుదల చేస్తామని తెలిపాయి. Also Read: ఉద్యోగాలు కోల్పోనున్న 25 వేల మంది ప్రభుత్వ టీచర్లు #cancer #telugu-news #everest-masala #mdh-masala మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి