రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత వైద్యం.. కేంద్రం కీలక నిర్ణయం

రోడ్డు ప్రమాద బాధితులకు ఉచితంగా వైద్య చికిత్స అందించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. రాబోయే మూడు, నాలుగు నెలల్లో ఈ విధానాన్ని దేశంలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రణాళిక చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

మద్యం మత్తులో  ఎమ్మార్వో కుమారుడి డ్రైవింగ్...యువకుడు మృతి
New Update

Cashless Medical Treatment For Road Accident Victims : నిత్యం ఎక్కడో ఓచోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ఈ ప్రమాదంలో కొందరు గాయాలపాలైతే మరికొందరు మరణిస్తారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం (Central Government) ఓ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రోడ్డు ప్రమాద బాధితులకు ఉచితంగా వైద్య చికిత్స అందించేందుకు కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం. రాబోయే మూడు, నాలుగు నెలల్లో ఈ విధానాన్ని దేశంలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మోటారు వాహనాల సవరణ చట్టం 2019లో భాగంగా ఈ విధానాన్ని తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

Also Read: ఇప్పుడేం చేద్దాం! బీఆర్‌ఎస్‌లో చేరిన నేతల్లో అయోమయం

మరో విషయం ఏంటంటే ఇప్పటికే ఈ విధానాన్ని కొన్ని రాష్ట్రాలు దీన్ని అభివృద్ధి చేస్తున్నాయి. అయితే ఇప్పుడు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సహకారంతో రోడ్డు రవాణా, హైవే మంత్రిత్వ శాఖ దీన్ని దేశవ్యాప్తంగా అమలు చేయనుంది. అయితే సుప్రీం కోర్టు తీర్పునకు అనుగూణంగా ప్రమాదం జరిగిన వెంటనే దగ్గర్లో ఉన్న ఆసుపత్రిలో ఉచితంగా వైద్యం అందించడమే దీని ఉద్దేశమని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి అనురాగ్ జైన్ తెలిపారు. అంతేకాదు ఈ విధానాన్ని గోల్డెన్ అవర్ ( ప్రమాదం జరిగిన గంటలోపు )తో పాటు రోడ్డు ప్రమాద బాధితులకు కూడా దీన్ని వర్తింపజేస్తామని పేర్కొన్నారు. రాబోయే మూడు, నాలుగు నెలల్లో ఈ విధానం అందుబాటులోకి వస్తుందని తెలిపారు. మరోవిషయం ఏంటంటే భారత్‌లోనే ఎక్కువగా రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని అనురాగ్‌ జైన్ అన్నారు. అలాగే రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన అంశాలను స్కూల్, కాలేజీ పాఠ్యాంశాంల్లో చేర్చేందుకు కూడా కేంద్ర విద్యాశాఖ అనుమతి ఇచ్చినట్లు వెల్లడించారు.

Also Read: ఎన్నికల కోడ్‌ ఎత్తివేత.. ఎన్నికల సంఘం కీలక ప్రకటన

#central-government #national-news #treatment #accident
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe