NEET Paper Leakage : నీట్ పరీక్ష రద్దు చేయొద్దు.. సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్

నీట్‌ యూజీ పేపర్‌ లీక్‌పై సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. నీట్ పరీక్షను రద్దు చేయడం హేతుబద్ధం కాదని.. ఇలా చేస్తే నిజాయతీగా పరీక్ష రాసిన అభ్యర్థుల ప్రయోజనాలను దెబ్బ తీసినట్లవుతుందని పేర్కొంది.

New Update
NEET Paper Leakage : నీట్ పరీక్ష రద్దు చేయొద్దు.. సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్

Supreme Court : నీట్‌ యూజీ పేపర్‌ లీక్‌ (NEET UG Paper Leak) పై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. నీట్ పరీక్షను రద్దు చేయడం హేతుబద్ధం కాదని.. ఇలా చేస్తే నిజాయతీగా పరీక్ష రాసిన అభ్యర్థుల ప్రయోజనాలను దెబ్బ తీసినట్లవుతుందని పేర్కొంది. పారదర్శకంగానే పోటీ పరీక్షలు నిర్వహించేందుకు కట్టుబడి ఉన్నట్లు పేర్కొంది. నీట్ పేపర్‌ లీక్ కేసుకు సంబంధించి కొంతమంది నిందితులను అరెస్టు చేశామని చెప్పింది. భారీ స్థాయిలో అక్రమాలు జరిగినట్లు ఆధారాలు లేవని.. అందుకే మొత్తం పరీక్షను, ఇప్పటికే విడుదలైన ఫలితాలను రద్దు చేయడం కరెక్ట్ కాదని అఫిడవిట్‌లో వివరించింది.

Also read: భోలే బాబాకు రూ.100 కోట్ల ఆస్తి.. బయటపడుతున్న విస్తుపోయే నిజాలు

ఇదిలాఉండగా.. వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు మే 5న జరిగిన నీట్‌ పరీక్ష (NEET Exam) లో అవకతవకలు, లీకేజీలు జరిగినట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నీట్ రద్దు చేసి మళ్లీ కొత్తగా నిర్వహించాలని డిమాండ్లు వస్తున్నాయి. పరీక్ష రాసివారిలో 1563 మందికి గ్రేస్ మార్కులు కలపడం, ఓఎంఆర్‌ షీట్లు అందకపోవడం, పలువురు విద్యార్థులు తమకు పేపర్ లీక్‌ అయిందని చెప్పడం లాంటి పరిణామాల నేపథ్యంలో నీట్‌ పరీక్షను రద్దు చేయాలని 26 పిటిషన్లు దాఖలయ్యాయి. మరోవైపు ఈ పరీక్షను మళ్లీ నిర్వహించకూడదని అత్యత్తమ ర్యాంకులు సాధించిన గుజరాత్‌ (Gujarat) కు చెందిన 56 మంది విద్యార్థులు కూడా సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్లను సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్ డీవై చంద్రచూడ్‌ (DY Chandrachud) నేతృత్వంలో ధర్మాసనం జులై 8న విచారించనుంది.

Also Read: లేబర్ పార్టీ భారీ విజయం.. స్పందించిన ప్రధాని మోదీ..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు