Pension : మహిళా ఉద్యోగులకు గుడ్‌ న్యూస్.. పెన్షన్‌లో కొడుకు లేదా కూతురు పేరు నామినేట్

మహిళా ఉద్యోగులకు కేంద్రం ప్రభుత్వం మంచి న్యూస్ చెప్పింది. ఇక మీదట నుంచి తమకు వచ్చే పెన్షన్‌లో నామినేటెడ్ పర్శన్ కింద భర్త కాకుండా కొడుకు లేదా కూతురు పేర్లను ఇచ్చుకోవచ్చని ప్రకటించింది.

New Update
Pension : మహిళా ఉద్యోగులకు గుడ్‌ న్యూస్.. పెన్షన్‌లో కొడుకు లేదా కూతురు పేరు నామినేట్

Women Pension : సాధారణంగా పెన్షన్ స్కీమ్స్(Pension Schemes) ఎలా ఉంటాయి అంటే... మనం రిటైర్ అయిన తర్వాత ప్రభుత్వం నుంచి మనకు ప్రతీనెల కొంత డబ్బు అందుతుంది. మనం బతికున్నంత కాలం మనం వాడుకోవచ్చు. అలాగే చనిపోయక కూడా మనం ఎవరిని అయితే నామినేటెడ్ వ్యక్తి(Nominee) గా పేరు నమోదు చేస్తామో వారికి మన పెన్షన్‌ను అందిస్తారు. అయితే ఇందులో ఇప్పటి వరకు భర్త అయితే భార్య పేరు... భార్య ఉద్యోగి అయితే భర్త పేరును నామినేషన్ చేసేందుకు అనుమతించేవారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ పరిమితులను సడలించింది. మహిళా ఉద్యోగులకు ప్రత్యేక వెసులుబాటును కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.

Also Read : PM Kisan: రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్‌.. పీఎం కిసాన్ రూ.9వేలకు పెంపు?

కొడుకు లేదా కూతురు పేరును నామినేట్ చేయొచ్చు..

మహిళా ఉద్యోగులు(Women Employees) ఇక మీదట ఎవరైనా పెన్షన్‌లో నామినేటెడ్ వ్యక్తి వివరాలు మార్చుకోవాలన్నా లేదా కొత్తగా జత చేయాలన్నా చేసుకోవచ్చును. తనంతట తానే స్వతహాగా భర్తకు ఇవ్వాలనుకుంటే ఓకే...లేదూ అలా కాదు తన కొడుకుకో, కూతురుకో ఇవ్వాలనుకుంటే...ఇప్పుడు అది కూడా చేయవచ్చును. సామాజిక-ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని కేంద్ర సిబ్బంది సహాయ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. మహిళా ప్రభుత్వ ఉద్యోగులు లేదా పెన్షనర్లు తమ అర్హులైన వారికి కుటుంబ పింఛను మంజూరు చేసేందుకు వీలు కల్పిస్తూ 2021 కేంద్ర పౌర సేవల (పెన్షన్) రూల్స్, 2021కి డిపార్ట్‌మెంట్ ఆఫ్ పెన్షన్స్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ (DOPPW) సవరణను ప్రవేశపెట్టిందని ఆయన చెప్పారు. అంతేకాదు విడాకులు తీసుకున్న మహిళలు, గృహహింస, వరకట్న బాధితులు మొదలైన వారికి ఈ పెన్షన్ సవరణ ఉపయోగపడుతుందని...తమ తదనంతరం తమ పిల్లలకు డబ్బులు అందుతాయని మంత్రి అన్నారు. ఇది మహిళలకు రక్షణగా ఉంటుందని తెలిపారు.

Also Read : Aasara Pension: పెన్షన్ దారులకు రేవంత్ సర్కార్ షాక్

Advertisment
తాజా కథనాలు