Kishan Reddy: కాంగ్రెస్ ఆఖరికి ఆవు పేడను కూడా వదలదు.. పొన్నాల లక్ష్మయ్య పెనంలోంచి పొయ్యిలో: కిషన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఛత్తీస్ గడ్ లో ఆవు పేడ కుంభకోణం బయట పడిందని.. కాంగ్రెస్ పార్టీ ఆఖరికి ఆవు పేడను కూడా వదలడం లేదంటూ నిప్పులు చెరిగారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 9 ఏళ్లలో కమిషన్ల రూపంలో దోచుకున్న సొమ్మును ఖర్చు చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరుతున్న పొన్నాల లక్ష్మయ్య పెనంలోంచి పొయ్యిలో పడుతున్నారన్నారు. By Nikhil 14 Oct 2023 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి దోపిడీ, అవినీతి, అహంకారం కాంగ్రెస్ పార్టీ (Congress Party) డీఎన్ఏలోనే ఉన్నాయని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి (Kishan Reddy) ధ్వజమెత్తారు. ప్రజా సంపదను లూటీ చేయడంలో కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డబ్బులు కర్ణాటక నుంచి వస్తున్నాయని ఆరోపించారు. బెంగళూర్ ఆర్టీనగర్ లో ఒక కాంగ్రెస్ నేత ఇంట్లో రూ.42 కోట్లు బయట పడ్డాయన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో లూటీ కొనసాగుతోందన్నారు. ఛత్తీస్ ఘడ్ లో ఆవు పేడ కుంభకోణం బయట పడిందని.. కాంగ్రెస్ పార్టీ ఆఖరికి ఆవు పేడను కూడా వదలడం లేదంటూ నిప్పులు చెరిగారు. రాహుల్ గాంధీ చేసింది జోడో యాత్ర కాదు ఇండియా లుటో యాత్ర అంటూ విమర్శలు గుప్పించారు. జలయజ్ఞం, భూ యజ్ఞం పేరుతో కాంగ్రెస్ పార్టీ దోపిడీ చేసిందన్నారు. ఇది కూడా చదవండి: Telangana Elections: రేవంత్‌ను పొల్లు పొల్లు తిట్టిన పొన్నాల లక్ష్మయ్య, కేటీఆర్.. ఏమన్నారంటే.. బోఫోర్స్, బొగ్గు, కామన్ వెల్త్, టెలికాం వంటి భారీ అవినీతి కుంభకోణాలు చేసి కాంగ్రెస్ పార్టీ దేశ సొమ్మును లూటీ చేసిందన్నారు కిషన్ రెడ్డి. దొంగ పత్రాలు సృష్టించి అభివృద్ధి పనుల పేరుతో వివిధ సామాజిక వర్గాలను బీఆర్ఎస్ పార్టీ మభ్యపెడుతోందన్నారు కిషన్ రెడ్డి. తొమ్మిదేళ్లలో కమిషన్ రూపంలో వచ్చిన డబ్బులను ఈ ఎన్నికలలో ఖర్చు పెట్టేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల DNA ఒక్కటేనన్నారు. మోదీ పాలనను ప్రపంచం మెచ్చుకుంటోందన్నారు. బీఆర్ఎస్ ను ఫామ్ హౌస్ కు పంపాలని ప్రజలకు పిలుపునిచ్చారు కిషన్ రెడ్డి. ఏ ప్రాతిపదికన ప్రవళిక మృతిపై ఆరోపణలు చేస్తున్నారో పోలీసులు చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రవళికకు సంఘీభావంగా లక్షలాది మంది యువత కదిలి వచ్చారన్నారు. ప్రభుత్వం పై ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో నిన్న యువత ను చూస్తుంటే అర్థం అవుతోందన్నారు. రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలన్నీ గోల్ మాల్ గా చూయిస్తున్నారన్నారు. లక్షలాది యువత జీవితాలతో ఆడుకుంటున్న TSPSC ను రద్దు చేయకుండా ఎందుకు కాపాడుతున్నారు? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కిషన్ రెడ్డి. కేసీఆర్ సీఎం కుర్చీపై కూర్చునే నైతిక హక్కు కోల్పోయారన్నారు. కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరుతున్న పొన్నాల లక్ష్మయ్య పెనంలోంచి పొయ్యిలో పడుతున్నారన్నారు. #brs #congress #rahul-gandhi #telangana-politics #bjp-kishan-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి