LPG Cylinder: రక్షా బంధన్ గిఫ్ట్.. ఎల్‌పీజీ సిలిండర్ ధరలు తగ్గింపు.. ఎంతంటే?

వినియోగదారులకు గుడ్‌న్యూస్‌..రక్షా బంధన్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. LPG సిలిండర్లపై ధరలు తగ్గునున్నాయి. ద్రవ్యోల్బణంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు కాస్త రిలీఫ్‌ ఇచ్చేందుకు మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయ LPG సిలిండర్ల ధరలను రూ.200 తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే.. ఈ ప్రయోజనం ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

New Update
LPG Cylinder: రక్షా బంధన్  గిఫ్ట్.. ఎల్‌పీజీ సిలిండర్ ధరలు తగ్గింపు.. ఎంతంటే?

Gas Cylinder Prices cut: గ్యాస్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌..రక్షా బంధన్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. LPG సిలిండర్లపై ధరలు తగ్గునున్నాయి. ద్రవ్యోల్బణంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు కాస్త రిలీఫ్‌ ఇచ్చేందుకు మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయ LPG సిలిండర్ల ధరలను రూ.200 తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే.. ఈ ప్రయోజనం ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. తగ్గిన ధరలు రేపటి నుంచి అమలులోకి రానున్నాయి.

ఈ నెల ప్రారంభంలో, చమురు మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య ఎల్‌పీజీ(LPG) ధరల సవరణను అమలు చేశాయి. దేశీయ వంట గ్యాస్ రేట్లను యథాతథంగా ఉంచాయి. ఈ సర్దుబాటులో ముఖ్యంగా 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ(LPG)గ్యాస్ సిలిండర్ల ధరలో రూ.99.75 గణనీయంగా తగ్గింది. ఇది ఆగస్టు ఫస్ట్ నుంచి అమల్లో ఉంది. దీని కారణంగా ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ రిటైల్ అమ్మకపు ధర ఇప్పుడు రూ.1,680కి చేరుకుంది. ఈ ఏడాది మార్చి 1 నుంచి 14.2 కిలోల ఎల్‌పిజి డొమెస్టిక్‌ వంట గ్యాస్ సిలిండర్ల ధరలు మారలేదు. నాన్ సబ్సిడీ డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ల ధరలు వరుసగా ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, చెన్నైలలో రూ.1,103, రూ.1,129, రూ.1,102.50, రూ.1,118.50గా ఉన్నాయి. ఇటు హైదరాబాద్‌లో 14.2 కిలోల ఎల్‌పిజి డొమెస్టిక్‌ వంట గ్యాస్ సిలిండర్‌ రూ. 1,155.00గా ఉంది

ఎన్నికల ఎఫెక్ట్:

వాణిజ్య, గృహ ఎల్‌పీజీ సిలిండర్ల కోసం నెలవారీ ధర సవరణలు సాధారణంగా ప్రతి నెల మొదటి రోజున జరుగుతాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMC) ఎల్‌పీజీ ధరలను ఫిక్స్‌ చేస్తాయి. స్థానిక పన్నులు, నిబంధనల కారణంగా దేశీయ వంట గ్యాస్ ధరలు రాష్ట్రాల మధ్య మారవచ్చు.

మరోవైపు త్వరలోనే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రతిసారి ఎన్నికలకు ముందు రేట్ల తగ్గింపు.. తర్వాత పెంపు సహజమేనంటున్నారు విశ్లేషకులు. అయితే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముగిసిన తర్వాత కూడా మరో ఐదు నెలలకే జనరల్‌ ఎలక్షన్స్‌ ఉన్నాయి. దీంతో ఈ తగ్గింపు వల్ల చాలా ప్రయోజనం ఉండనుందన్నది వాళ్ల మాట. ముఖ్యంగా మధ్యతరగతి వారికి ఇది గుడ్‌న్యూస్‌. ఎందుకంటే బయటకు ధరలు వాచిపోతున్నాయి.. అప్పుడెప్పుడో రూ.110 దాటిన పెట్రోల్‌ ధరలు ఇప్పటివరకు దిగి రాలేదు. ఇక పప్పు, ఉప్పు...ఇలా నిత్యావసరాల ధరలు చుక్కలని అంటి చాలా కాలం అయ్యింది. అవి దిగిరావడం కాలేదు. కనీసం వంట్‌ గ్యాస్‌ అయినా తగ్గించడంతో వినియోగదారులు కాస్త రిలీఫ్‌ ఫీల్ అవుతున్నారు.

ALSO READ: నిరుద్యోగులకు శుభవార్త.. గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు భర్తీకి గ్రీన్ సిగ్నల్

Advertisment
తాజా కథనాలు