అమెరికా, భారత్‌లోని పలు ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ బయటపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం.. బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందకుండా ప్రజలకు పలు సూచనలు చేసింది. పచ్చి పాలు తాగొద్దని, అధిక ఉష్ణోగ్రతలో వండిన మాంసాహారం తినడం మంచిదని తెలిపింది. ఏవియన్ ఫ్లూ మనుషులకు రాకుండా అడ్డుకునేందుకు చర్యలు తీసుకోవచ్చని పేర్కొంది. అయితే అమెరికాలోని దాదాపు 8 రాష్ట్రాల్లో పలు పశువుల పాలలో ఈ వైరస్ ఉన్నట్లు నిర్ధారించారు. ఈ ఇన్ఫెక్షన్ భారత్‌లోని కేరళ, జార్ఖండ్,మహారాష్ట్రలోని కొన్ని జిల్లాలలో కూడా దీన్ని గుర్తించారు. ఇలాంటి పరిస్థితుల్లో పాలను బాగా మరిగించి తీసుకోవాలని.. ఇలా చేయడం వల్ల వైరస్ మనుషులకు వ్యాపించకుండా నిరోధించవచ్చని కేంద్రం సూచించింది.
Also read: పదవ తరగతి ఫలితాలు విడుదల.. ఈ లింక్‌తో డైరెక్ట్ రిజల్ట్స్
అయితే సెంట్రల్ హెల్త్ డైరెక్టర్ జనరల్ డా. అతుల్ గోయల్ అధ్యక్షతన సీజనల్ ఇన్‌ఫ్లుయెంజా సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో హెచ్5ఎన్1, హెచ్1ఎన్1 రకాల ఇన్ఫ్లుఎంజాపై చర్చించారు. ఈ రెండు వైరస్‌లు ఒకే కుటుంబానికి చెందినవి. కేరళలోని మూడు జిల్లాల్లోని బాతులలో H1N1 ఇన్‌ఫెక్షన్ ఉన్నట్లు నిర్ధారించారు. మనం భారత్‌లో.. ఈ వైరస్ ఏటా కనీసం రెండుసార్లు బయటపడుతుంది. మొదటిటి జనవరి నుండి మార్చి వరకు మరియు రెండవది రుతుపవనాలు వచ్చిన తర్వాత.
ప్రస్తుతం బర్డ్ ఫ్లూ పరిస్థితి అదుపులోనే ఉందని వైద్యులు తెలిపారు. సీజనల్, ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌లను కూడా పర్యవేక్షిస్తున్నారు. H1N1 కేసులతో వ్యవహరించే ఆరోగ్య కార్యకర్తలకు టీకాలు వేయాలని కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశించింది. అయితే దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతున్న వ్యక్తులు, పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేసింది.
Also Read: ఇవాళ టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి మేనిఫెస్టో.. ప్రధాన అంశాలు ఇవే