Kolkata: ఆధార్ కార్డును 'డీయాక్టివేట్' చేస్తోంది.. కేంద్రంపై మమతా సంచలన ఆరోపణలు

కేంద్ర ప్రభుత్వంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. ప్రజల ఆధార్ కార్డును బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 'డీయాక్టివేట్' చేస్తుందంటూ మండిపడ్డారు. ఆధార్ కార్డు లేకపోయినా సరే లబ్దిదారులకు తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తుందని హామీ ఇచ్చారు.

New Update
Kolkata: ఆధార్ కార్డును 'డీయాక్టివేట్' చేస్తోంది.. కేంద్రంపై మమతా సంచలన ఆరోపణలు

Mamahta: పశ్చిమ బెంగాల్ సీఎం (CM Mamatha) మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు తమ రాష్ట్రంలోని ప్రజల ఆధార్ కార్డును బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 'డీయాక్టివేట్' చేసిందంటూ మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు, వాటికి సంబంధించిన ప్రయోజనాలు ప్రజలకు చేరకుండా చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

డీయాక్టివేట్ చేస్తోంది..
ఈ మేరకు ఆదివారం బీర్‌భూమ్ జిల్లాలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో మమతా మాట్లాడుతూ.. 'ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డులను డీయాక్టివేట్ చేస్తోంది. ప్రభుత్వ పథకాలతో డీలింక్ చేయడం వల్ల లబ్దిదారులకు సంక్షేమ ప్రయోజనాలు దూరం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ మేము ప్రతి ఒక్కరికీ పథకాలకు సంబంధించి ఫలాలను అందిస్తున్నాం. ఆధార్ కార్డు లేకపోయినా లబ్ధిదారులకు చెల్లిస్తాం. ఏ ఒక్క లబ్ధిదారుడిపై ప్రభావం ఉండదు. ఆధార్ కార్డు లేకపోయినా సరే లబ్దిదారులకు మా ప్రభుత్వం వివిధ పథకాలకు చెందిన ప్రయోజనాలను అందిస్తూనే ఉంటుంది' అని స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి : Suryapet: మరో గురుకుల విద్యార్థిని ఆత్మహత్య.. మళ్లీ అదే హాస్టల్!

ఈ సందర్భంగా హర్యానా, పంజాబ్‌లలో రైతులు చేస్తున్న ఆందోళనను ప్రస్తావించిన ఆమె.. పంటలకు కనీస మద్దతు ధరపై ప్రభుత్వం హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుల నిరసనకు సెల్యూట్ చేస్తున్నానని, రైతులపై ప్రభుత్వం చేస్తున్న దాడులను ఖండించారు.

Advertisment
తాజా కథనాలు