central election commission:నేడు హైదరాబాద్ కి కేంద్ర ఎన్నికల బృందం. తెలంగాణకు ఎన్నికల ఫీవర్ స్టార్ట్ అయింది. దీన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ మరింత పెంచనుంది. కేంద్ర ఎలక్షన్ కమిషన్ అధికారులు ఈరోజు నుంచి 3 రోజుల పాటూ తెలంగానలో పర్యటించనున్నారు. ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు, సన్నద్ధత మీద ఎన్నికల అధికారులు, సంస్థలతో సమీక్షించనున్నారు. By Manogna alamuru 03 Oct 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి కేంద్ర ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ సారథ్యంలో 17మంది అధికారుల బృందం హైదరాబాద్ కు చేరుకోనున్నారు. తాజ్ కృష్ణ హోటల్లో బస చేయనున్నారు. నేటి నుంచి మూడు రోజుల పాటు హైదరాబాద్ లో కేంద్ర ఎన్నికల సంఘం సమావేశాలు నిర్వహించనుంది. ఇవాళ మధ్యాహ్నం 2.30 నుండి 4.30 వరకు గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీలతో సమావేశం జరుగుతంది. తర్వాత సాయంత్రం 5 గంటల నుండి 7.30 గంటల వరకు పలు ఎన్ఫోర్స్ మెంట్ ఏజెన్సీలతో రివ్యూ, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి, అధికారుల ప్రెజెంటేషన్ ఉంటుంది. ఇక రేపు అంటే 4 వ తేదీన ఉదయం 6.30 కు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జీపై సైక్లోథాన్, వాక్ థాన్ లో కేంద్ర ఎన్నికల బృందం పాల్గొననుంది. తర్వాత ఉదయం 9.30 నుండి సాయంత్రం 7 వరకు జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలు, సీపీలతో సమావేశం అవుతుంది. అలాగే 5 వ తేదీ ఉదయం 9 గంటలకు టెక్ మహీంద్రలో స్టేట్ ఐకాన్స్, దివ్యాంగ ఓటర్లు, యువ ఓటర్లతో ఇంటరాక్షన్ అవనుంది కేంద్ర బృందం. తర్వాత 11 గంటలకు సీఎస్ శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్ లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించనుంది. తర్వాత మధ్యాహ్నాం 1 గంటకు ప్రెస్ కాన్ఫరెన్స్ కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు నిర్వహిస్తారు. దీంతో పాటూ ఓటర్ల జాబితా,ఎన్నికల ఏర్పాట్లు, నిఘా పై ఆరా తీయనుంది. ఇది కూడా చదవండి:తెలంగాణలో తగ్గని కారు జోరు.. టౌమ్స్ నౌ సర్వే సంచలన లెక్కలివే! వీటన్నింటితో పాటూ రాజకీయ పార్టీ ప్రతినిధులు, కలెక్టర్లు, ఎస్పీలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజన్ కుమార్ లతో ఈసీ సమావేశం కానుంది. సీఈసీ బృందం పర్యటన తర్వాత త్వరలో ఎన్నికల షెడ్యూల్ విడుదల రిలీజ్ కాబోతోంది. తెలంగాణలో పలు భాగాల అధికారులతో చర్చించిన తర్వాతనే ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. వారంలో తెలంగాణ షెడ్యూల్ ప్రకటించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకటనకు ముందు తెలంగాణలో పరిస్థితులపై పూర్తిగా సమీక్ష చేయనున్నారు కేంద్ర ఎన్నికల బృందం. ఇది కూడా చదవండి:తెలంగాణలో ఈరోజు ప్రధాని మోదీ పర్యటన #telangana #hyderabad #elections #central #tour #state #commission మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి