Nalgonda: మినీ జమిలి ఎన్నికలు జరిపేలా కూడా కేంద్రం కుట్రలు: గుత్తా సుఖేందర్‌రెడ్డి

శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి నల్గొండ జిల్లాలో ప్రెస్‌మీట్ నిర్వహించారు. సెప్టెంబర్‌ 17న నాడు జాతీయ సమైక్యత దినోత్సవాన్నీ పెద్ద ఎత్తున జరుపుతామన్నారు. ఈ వేడుకల్లో ప్రజలు వెల్లువలా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. సెప్టెంబర్‌ 17న నాడు మరోసారి అమరులను స్మరించుకుందామన్నారు. కేంద్రం ప్రజాస్వామ్యన్నిచంపేలా కుట్రలు చేస్తుందని ఆయన మండిపడ్డారు.

Nalgonda: మినీ జమిలి ఎన్నికలు జరిపేలా కూడా కేంద్రం కుట్రలు: గుత్తా సుఖేందర్‌రెడ్డి
New Update

ప్రజాస్వామ్యన్ని చంపేలా కుట్రలు

శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి నల్గొండ జిల్లాలో ప్రెస్‌మీట్ నిర్వహించారు. సెప్టెంబర్‌ 17న నాడు జాతీయ సమైక్యత దినోత్సవాన్నీ పెద్ద ఎత్తున జరుపుతామన్నారు. ఈ వేడుకల్లో ప్రజలు వెల్లువలా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. సెప్టెంబర్‌ 17న నాడు మరోసారి అమరులను స్మరించుకుందామన్నారు. కేంద్రం ప్రజాస్వామ్యన్నిచంపేలా కుట్రలు చేస్తుందని ఆయన మండిపడ్డారు. షెడ్యూల్ ప్రకారం ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించాలి. కానీ కేంద్రం ఎదో కుట్ర చేస్తుందని ఆయన ఆరోపణలు చేశారు. జమిలి ఎన్నికల పేరు మీద గందరగోళం సృష్టించింది కేంద్రం.. అన్ని కుట్రలు చేసి ఎలాగైనా మళ్ళీ అధికారంలోకి రావాలన్నదే కేంద్రం ప్రయత్నం చేస్తోందని విమర్శలు చేశారు.

కేసీఆర్‌ని మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తాం

నల్గొండలోని తన నివాసంలో గుత్తా మాట్లాడుతూ.. మినీ జమిలి ఎన్నికలు జరిపేలా కూడా కేంద్రం కుట్రలు చేస్తోందన్నారు. కేంద్రం ప్రభుత్వం రాజకీయ పార్టీలను గందరగోళంకి నెట్టిందని మండిపడ్డారు. న్యూసెన్స్ చేస్తూ కేంద్రం గట్టు ఎక్కాలనే దూరలోచన ఉన్నదన్నారు. రాష్ట్ర భష్యత్తు కోసం తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ని మళ్ళీ ముఖ్యమంత్రిని చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. BRSని గెలిపించాలన్నారు. కాంగ్రెస్ ఆరోపణలు చూస్తుంటే నవ్వు వస్తుందన్నారు. కేసీఆర్ మంత్రివర్గంలో ద్రోహులు ఉన్నారని అంటున్న కాంగ్రెస్ ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు.

ద్రోహులంతా ఒక్క దగ్గరే ఉన్నారు

కాంగ్రెస్‌లో ఇవాళ తెలంగాణ ద్రోహులు, తెలంగాణ వ్యతిరేకులు చేరారు. షర్మిల కూడా కాంగ్రెస్‌లో చేరుతుందన్నారు. తెలంగాణ ద్రోహుల పార్టీ కాంగ్రెస్.. షర్మిల తెలంగాణ వ్యతిరేకి కదా..? అని పశ్నించారు. KTR సమర్థుడు, గొప్పగా చదువుకున్న వ్యక్తి..ఈ సారి హైదరాబాద్‌లో బీఆర్ఎస్‌ ప్రభంజనం సృష్టస్తున్నదన్నారు. హైదరాబాద్ విశ్వ నగరంగా మారిందంటే అది కేటీఆర్‌ వల్లనే అని అన్నారు. అనవసర ఆరోపణలు చేయడం కాంగ్రెస్‌కు తగదు.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలవి పగటి కలలే..బీఆర్ఎస్‌ వల్లనే సుస్థిరమైన పాలన ఉంటుందని నల్గొండలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వివరించారు. తెలంగాణ వ్యతిరేకులంతా ఏకమవుతున్నారన్నారని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అందరూ తలా ఒకదారి ఎంచుకున్నారని గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికలు దగ్గర పడ్డాయంటూ ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారన్నారని మండిపడ్డారు. జమిలి ఎన్నికల పేరుతో కేంద్రం జిమ్మిక్కులు చేస్తోందని శాసన మండలి ఛైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు.

#chairman #nalgonda #hold-mini-jamili-elections #center-is-also-conspiring #gutta-sukhender-reddy #legislative-council
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe