Venu Swamy: 'బిగ్ బాస్' సీజన్ 8 లో వేణు స్వామి ఎంట్రీ ఫిక్స్.. చరిత్రలోనే అత్యధిక పారితోషికం?

బిగ్ బాస్ నిర్వాహకులు వేణు స్వామికి నెక్స్ట్ సీజన్ లో పార్టిసిపేట్ చేసే ఛాన్స్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై ఇటీవలే ఆయనను సంప్రదించగా.. వేణు స్వామి కూడా ఒప్పుకున్నారని బుల్లితెర వర్గాల్లో జోరుగా ప్రచారం నడుస్తోంది. ఇందుకోసం ఆయనకు భారీ రెమ్యునరేషన్ కూడా ఇస్తున్నారట.

New Update
Venu Swamy: 'బిగ్ బాస్' సీజన్ 8 లో వేణు స్వామి ఎంట్రీ ఫిక్స్.. చరిత్రలోనే అత్యధిక పారితోషికం?

Venu Swamy Into Bigg Boss:సెలబ్రెటీ జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ సోషల్ మీడియాలో ఫుల్ పాపులర్ అయ్యాడు. సెలెబ్రెటీలకు సంబంధించి ఇతను చెప్పిన అంచనాలు చాలా వరకు నిజమయ్యాయి. అయితే ఈ మధ్య వేణు స్వామి వైఎస్ జగన్ గెలుస్తారని చెప్పారు. కానీ అది జరగలేదు. దాంతో ఈయన్ని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు. ఈ క్రమంలోనే ఇక నుంచి సోషల్ మీడియాలో జాతకాలు చెప్పడం మానేస్తానని స్వయంగా సంచలన ప్రకటన చేశారు.

సోషల్ మీడియాకు ఆయన దూరంగా ఉండాలని కోరుకుంటున్నా నెటిజన్స్ మాత్రం ఆయన్ను వదలడం లేదు. సోషల్ మీడియాలో ఆయనకు సంబంధించిన పోస్ట్‌లు, మీమ్స్‌ అన్నీ హల్చల్ చేస్తునే ఉన్నాయి. తాజాగా ఆయనకు ఉన్న ఈ క్రేజ్‌ని బిగ్ బాస్ టీం గుర్తించినట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ నిర్వాహకులు వేణు స్వామికి నెక్స్ట్ సీజన్ లో పార్టిసిపేట్ చేసే ఛాన్స్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. వేణు స్వామి కోసమైనా చాలామంది ప్రజలు టీవీలకు అతుక్కుపోతారని బిగ్ బాస్ నిర్వహకులు నమ్ముతున్నారట.

Also Read : “జనక అయితే గనక”.. మరో కొత్త కథతో వచ్చేస్తున్న సుహాస్

భారీ రెమ్యునరేషన్...

ఆ కారణం చేతే ఆయనను సంప్రదించారని, బిగ్ బాస్ లో పాటిస్పేట్ చేయడానికి వేణు స్వామి కూడా ఒప్పుకున్నారని బుల్లితెర వర్గాల్లో జోరుగా ప్రచారం నడుస్తోంది. అంతేకాదు బిగ్ బాస్ హిస్టరీలోనే ఇప్పటివరకు మరే సెలెబ్రిటీ తీసుకొని పారితోషికం వేణు స్వామి తీసుకుంటున్నారట. మొదటగా ఆయన చాలా రెమ్యునరేషన్ అడిగారని అయితే బిగ్‌బాస్ టీమ్‌ తొలుత సందేహించినా ఆ తర్వాత అతనికున్న క్రేజ్ ను చూసి ఓకే చెప్పిందని సమాచారం.

మొత్తం మీద ఈసారి వేణు స్వామి బిగ్ బాస్ హౌస్ లో సందడి చేయబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో జాతకాలతో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న ఈయన ఒకవేళ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తే ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తారో చూడాలి. కాగా వేణు స్వామితో పాటూ బిగ్ బాస్ నయా సీజన్ లో బర్రెలక్క, కుమారి ఆంటీని సైతం సెలెక్ట్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు