మొదటి నుంచి సూపర్ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకున్న టీమ్ ఇండియా చివరి మెట్టు మీద బోల్తా కొట్టింది. ఆస్ట్రేలియా చేతిలో 6 వికెట్ల తేడాతో ఓడి.. కోట్లాది అభిమానులను నిరాశపరిచింది. అయితే మొదటి నుంచి ఓడిపోకుండా వచ్చిన రోహిత్ సేన ఆటను ఎంత మాత్రం తక్కువ చేయడానికి వీలు లేదు. అన్ని విభాగాల్లో పటిష్టంగా ఆల్ రౌండర్ ప్రదర్శనతో వావ్ అనిపించుకుంది. ఈ నేపథ్యంలో సెలబ్రటీలు టీమ్‌ఇండియాకు అండగా నిలుస్తున్నారు. భారత జట్టుకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.
టీమ్ ఇండియా క్రికెట్లర్లు ఒక కుటుంబంలా ఆడి అందరి మనసులూ గెలుచుకున్నారు అన్నారు ఆనంద్ మహీంద్రా. మనం ఓడిపోలేదు. విజయం సాధిస్తే సంబరాలు ఎవరైనా చేసుకుంటారు కానీ ఓడిపోయినప్పుడే ఒకరికొకరు తోడుగా నిలబడాలని అన్నారు. ఇప్పటికీ తాను ఇండియన్ ప్లేయర్ల నుంచి ప్రేరణ పొందుతున్నానని అన్నారు ఆనంద్ మహీంద్రా.
ఈ టోర్నీలో భారత అద్భుతంగా ఆడింది, అందరికీ గర్వకారణం అన్నారు షారూఖ్ ఖాన్. పట్టుదలతో ఆడి, గొప్పస్ఫూర్తిని ప్రదర్శించారని పొగిడారు. ఆట అన్నత ర్వాత ఒకట్రెండు చేదు అనుభవాలుకూడా ఉంటాయి. అది ఈరోజు మనకు కలిగింది అంటూ చెప్పుకొచ్చారు. క్రికెట్‌లో మన వారసత్వాన్ని గొప్ప స్థాయికి తీసుకెళ్లిన టీమ్‌ఇండియాకు కృతజ్ఞతలు. ఈ దేశాన్ని గర్వపడేలా చేశారు అన్నారు షారూఖ్.
హార్డ్ లక్ టీమ్ ఇండియా అంటూ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ ట్వీట్ చేశారు. టోర్నీలో మనది కాని ఒక్క రోజు మన హృదయాలను ముక్కలు చేసింది. ఇప్పుడు ఆటగాళ్లు, అభిమానులు ఎంతటి వేదన అనుభవిస్తున్నారో నేను ఊహించగలను. గెలుపోటములు ఆటలో భాగం అని రాశాడు.
ఇక ఇండియన్ మాజీ ప్లేయర్ ఇర్ఫాన్ పఠాన్ రోహిత్ శర్మా మీరు ఒక అద్భుతం అంటూ పొగిడారు.
టీమ్ ఇండియా...ఫైనల్ మ్యాచ్ పలితం మీ ప్రతిభకు కొలమానం కాదంటూ చీర్ అప్ చేశారు బిగ్ బీ అమితాబ్ బచ్చన్. ఈ టోర్నీలో మీరు ఎందరో గొప్ప ఆటగాళ్ళను మట్టి కరిపించారు. మీరు ఎప్పటికీ బెస్ట్ అంటూ మనసుకు హత్తుకునే మాటఅలు రాశారు. మీరు ఎప్పటికీ బెస్ట్ గానే ఉంటారు...మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాం అన్నారు అమితాబ్.