EC Green Signal To Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ (Election Commission) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అత్యవసర విషయాలపైనే చర్చించాలని షరతులు పెట్టింది. ఎన్నికల విధుల్లో ఉన్న వారు కేబినెట్ భేటీకి వెళ్లకూడదని స్పష్టం చేసింది. రైతు రుణమాఫీ, ఉమ్మడి రాజధాని విషయాలను చర్చించవద్దని తెలిపింది. అత్యవసర విషయాలపైనే చర్చించాలని నిబంధనలు పెట్టింది. అయితే.. రైతు రుణమాఫీ అంశంపై చర్చించడమే ప్రధాన ఎజెండాగా కేబినెట్ భేటీ నిర్వహించాలని రేవంత్ సర్కార్ భావించింది. మంత్రివర్గ సమావేశంలో రుణామాఫీకి సంబంధించిన మార్గదర్శకాలను ఖరారు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు శనివారం సాయంత్రం మంత్రివర్గ సమావేశానికి ఏర్పాట్లు చేసింది.
అయితే.. ఈసీ నుంచి అనుమతి రాకవడంతో ఆఖరి నిమిషంలో మంత్రి వర్గ సమావేశం రద్దు చేయాల్సి వచ్చింది. అయితే.. ప్రస్తుతం మంత్రివర్గ సమావేశానికి ఈసీ అనుమతి ఇచ్చినా.. రుణమాఫీ అంశంపై చర్చకు పర్మిషన్ ఇవ్వకపోవడంతో ప్రభత్వానికి నిరాశ తప్పలేదు. మరోవైపు ఆగస్టు 15 లోగా రుణమాఫీ చేసి తీరుతానని రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అనేక సభల్లో స్పష్టం చేశారు. దీంతో ఆ తేదీలోగా రుణమాఫీ చేయడం ప్రభుత్వానికి ప్రతిష్టాత్మక అంశంగా మారింది. దీంతో రుణమాఫీ చేయడం కోసం రేవంత్ సర్కార్ తీసుకునే నెక్ట్స్ స్టెప్ ఏంటన్న అంశం ఆసక్తికరంగా మారింది.
Also Read: TSPSC పేరు మార్చనున్న రేవంత్ సర్కార్.. కొత్త పేరు ఇదే?