MLC Kavitha: ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసిన సీబీఐ

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవితకు షాక్ ఇచ్చింది సీబీఐ. ఎక్సైజ్ పాలసీ కేసులో కవితను అరెస్ట్ చేసింది. ప్రస్తుతం లిక్కర్ స్కాం కేసులో జ్యూడీషియల్ కస్టడిలో ఉన్నారు కవిత.

MLC Kavitha: ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసిన సీబీఐ
New Update

CBI Arrested MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవితకు షాక్ ఇచ్చింది సీబీఐ (CBI). ఎక్సైజ్ పాలసీ కేసులో (Excise Policy Case) కవితను అరెస్ట్ చేసింది. ప్రస్తుతం లిక్కర్ స్కాం కేసులో జ్యూడీషియల్ కస్టడిలో ఉన్నారు కవిత. ఇటీవల జ్యూడీషియల్ కస్టడీలో ఉన్న కవితను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని రౌస్ అవెన్యూ కోర్టులో (Rouse Avenue Court) పిటిషన్ ను సీబీఐ దాఖలు చేయగా.. దానికి సానుకూలంగా స్పందించిన కోర్టు.. కవితను విచారించేందుకు అనుమతించింది. అయితే కవితను విచారించేందుకు 10 రోజుల కస్టడీని సీబీఐ కోర్టును కోరనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 6వ తేదిన జైలులో ఎమ్మెల్సీ కవిత ను సీబీఐ ప్రశ్నించింది. మరోవైపు కవిత రెగ్యులర్ బెయిల్ పై ఈ నెల 16న కోర్టు విచారణ చేపట్టనుంది. గత నెల 15న లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈడీ కేసులో బెయిల్ వచ్చినా.. CBI కేసులో జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి..

అసలేమైంది..

లిక్కర్ స్కాం కేసులో (Delhi Liquor Scam) బెయిల్ కోసం ఆశగా ఎదురుచూస్తున్న ఎమ్మెల్సీ కవితకు ఊహించని షాక్ ఇచ్చింది సీబీఐ. మద్యం స్కాం కేసులో కవితను విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది సీబీఐ. అయితే… సీబీఐ వేసిన పిటిషన్ ను అంగీకరించిన కోర్టు.. కవితను విచారించేందుకు సీబీఐకి అనుమతి ఇచ్చింది. తీహార్ జైలులో మహిళా కానిస్టేబుల్ సమక్షంలో ఎమ్మెల్సీ కవితను సీబీఐ విచారించింది. కవిత ఇచ్చే వాంగ్మూలాన్ని సీబీఐ నమోదు చేసుకుంది. జైలులోకి ల్యాప్ టాప్, స్టేషనరీ తీసుకెళ్లేందుకు సీబీఐకి రౌస్ అవెన్యూ కోర్టు అనుమతించింది. విచారణకు ఒక రోజు ముందు జైలు అధికారులకు సమాచారం ఇవ్వాలని సీబీఐ కి కోర్టు ఆదేశాలు ఇచ్చింది.

Also Read: టాస్క్ ఫోర్స్ మాజీ DCP రాధాకిషన్‌రావుపై మరో కేసు

#mlc-kavitha #delhi-liquor-scam-case #cbi #ed
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe