Mahua Moitra: ఆ రోజునే ఎథిక్స్ కమిటీ విచారణకు మహువా మొయిత్రా

టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా నవంబర్ 2న లోక్‌సభ ఎథిక్స్ కమిటీ ముందు హాజరుకానున్నారు. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా వెల్లడించారు. అలాగే తనపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేసేందుకు ఎథిక్స్ కమటీ సరైనా వేదికేనా అంటూ ప్రశ్నించారు. అలాగే వ్యాపారవేత్త హీరానందానీని కూడా విచారణకు పిలవాలన కమిటీని అభ్యర్థించారు.

Mahua Moitra: మహువా మొయిత్రాకు మరో షాక్‌.. బంగ్లా ఖాళీ చేయాలని నోటీసులు..
New Update

పార్లమెంటు సమావేశాల్లో గౌతమ్ అదానీ కంపెనీలు, అలాగే ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేస్తూ ప్రశ్నలు అడగటానికి టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా డబ్బులు తీసుకున్నారని ఇటీవల బీజేపీ ఎంపీ ఆరోపణలు చేయడం రాజకీయంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో మహువా మొయిత్రా లోక్‌సభ నైతిక విలువల కమిటీ ముందు హాజరుకానున్నారు. నవంబర్ 2వ తేదీన తాను ఎథిక్స్ కమిటీ ముందు హాజరవుతానని మహువా వెల్లడించారు. అలాగే తనపై వచ్చిన నేరారోపణలపై విచారణ చేసేందుకు లోక్‌సభ ఎథిక్స్ కమిటీ సరైనా వేదికేనా అంటూ ఆమె ప్రశ్నలు సంధించారు. పార్లమెటరీ కమిటీకి నేరారోపణలపై విచారణ జరిపే అధికార పరిధిలేదని.. ఇలాంటి కేసుల్లో దర్యాప్తు సంస్థల్ని భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉందని పేరొన్నారు. అలాగే వ్యాపారవేత్త హీరానందానీని కూడా ఈ విచారణకు పిలవాలని కమిటీకి విజ్ఞప్తి చేశారు.

Also read: ట్యూషన్ కి వెళ్లిన బాలుడు..తిరిగి శవమై తేలాడు..అసలేం జరిగిందంటే..!

అదానీ గ్రూప్‌ను, ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకొని ప్రశ్నలు అడిగేందుకు మహువా హీరానందానీ నుంచి రూ.2 కోట్ల నగదు అలాగే ఖరీదైన బహుమతులు తీసుకున్నారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే ఆరోపణలు చేశారు. దీంతో లోక్‌సభ స్పీకర్‌కు ఆయన లేఖ రాయగా.. ఈ వ్యవహారం లోక్‌సభ నైతిక విలవల కమిటీ దృష్టికి వచ్చింది. ముందుగా అక్టోబర్‌ 31న విచారణకు హాజరు కావాలని ఎథిక్స్ కమిటీ ఆదేశించింది. కానీ అప్పటికే షెడ్యూల్ చేసిన కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉందని.. నవంబర్ 5 తర్వాత విచారణ తేదీ ఖరారు చేయాలని మహునా అభ్యర్థించారు. ఇక ఆమె విజ్ఞప్తిని తోసిపుచ్చిన ఎథిక్స్ కమిటీ నవంబర్ 2న వచ్చి తమకు మౌఖిక సాక్ష్యం ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలోనే మహువా నవంబర్ 2న కమిటీ ముందుకు వెళ్లనున్నట్లు పేర్కొన్నారు.

Also read: ఐటీ ఉద్యోగులకు షాక్.. 52 వేల ఉద్యోగాలు ఔట్

#national-news #telugu-news #mahua-moitra #adani-group
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe