Kerala Blasts: కేరళ పేలుళ్లపై కొనసాగుతున్న దర్యాప్తు.. ఆ కేంద్రమంత్రిపై కేసు నమోదు..

కేరళ పేలుళ్లకి సంబంధించి వివిధ వర్గాల మధ్య రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌పై కేసు నమోదైంది. ఆదివారం కేరళలో జరిగిన పేలుళ్లపై ఇటీవల మాట్లాడిన రాజీవ్.. కేరళలో సంఘ విద్రోహ శక్తులు బలపడుతున్నాయని.. ముఖ్యమంత్రి విజయన్ వీటిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ విమర్శలు చేశారు. దీనిపై స్పందించిన సీఎం.. రాజీవ్ చేసిన వ్యాఖ్యల్లో మతపరమైనా అజెండా ఉందంటూ కౌంటర్ వేశారు .

New Update
Kerala Blasts: కేరళ పేలుళ్లపై కొనసాగుతున్న దర్యాప్తు.. ఆ కేంద్రమంత్రిపై కేసు నమోదు..

కేరళలో ఆదివారం చోటుచేసుకున్న పేలుళ్లు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనకు సంబంధించి కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలపై కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు. వివిధ వర్గాల మధ్య విభేదాలు రెచ్చగొట్టేలా మాట్లాడిన నేపథ్యంలో కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఇటీవల ఈ పేలుళ్ల ఘటనపై స్పందించిన రాజీవ్ చంద్రశేఖర్.. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై విమర్శలు చేశారు. కేరళలో సంఘ విద్రోహ శక్తులు బలపడుతున్నాయంటూ వ్యాఖ్యానించారు. అయినాకూడా కేరళ సర్కార్ వీటిపై స్పందించకుండా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు చేశారు. దీనిపై స్పందించిన సీఎం పినరయి విజయన్.. రాజీవ్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఆయన చేసిన వ్యాఖ్యల్లో మతపరమైన అజెండా కనిపిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఒక బాధ్యతాయుతమైన మంత్రిగా ఈ ఘటనపై విచారణ చేస్తోన్న సంస్థలపై కొంచెమైనా గౌరవం చూపించాలని హితువు పలికారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభ దశలో ఉందని.. కానీ వాళ్లు మాత్రం కొన్ని వర్గాలే లక్ష్యంగా బహిరంగ ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. కొచ్చి సమీపంలోని కలమస్సేరిలో జమ్రా అంతర్జాతీయ సమావేశ కేంద్రంలోని ప్రార్థన మందిరంలో పేలుళ్లు జరగడం ఒక్కసారిగా దేశప్రజల్ని ఉలిక్కిపడేలా చేశాయి. ఈ దుర్ఘటనలో 12 ఏళ్ల బాలికతో సహా ముగ్గురు మృతి చెందారు. అలాగే దాదాపు 50 మంది క్షతగాత్రులయ్యారు. ఆ ప్రార్థన మందిరంలోకి వచ్చిన వారు కళ్లు మూసుకొని ప్రార్థిస్తుండగా.. ఎక్కవ తీవ్రతతో రెండు, స్వల్పస్థాయిలో ఒకటి కలిపి మొత్తం మూడు పేళుల్లు జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.

Advertisment
తాజా కథనాలు