Rahul Gandhi: రాహుల్‌ గాంధీపై కేసు సీఐడీకి బదిలీ..

రాహుల్ గాంధీ అస్సాంలో చేపట్టిన భారత్ న్యాయ జోడో యాత్రలో జనవరి 22న ఉద్రిక్తతలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో కాంగ్రెస్ కార్యకర్తల్ని రాహుల్ రెచ్చగొట్టారనే ఆరోపణలతో ఆయనపై కేసు నమోదయింది. దీనిపై విచారణ కోసం అస్సాం పోలీసులు కేసును సీఐడీ అప్పగించారు.

New Update
Rahul Gandhi: రాహుల్ యాత్రకు మూడ్రోజులు బ్రేక్

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఇటీవల భారత్ జోడో న్యాయ యాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. జనవరి22న అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం జరిగిన రోజున రాహుల్‌ గాంధీ అస్సాంలో పర్యటించారు. ఈ నేపథ్యంలో ఆ యాత్రలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో రాహుల్ గాంధీతో పాటు ఇతర నేతలపై అస్సాం పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఇప్పుడు ఈ కేసును పోలీసులు సీఐడీ (CID)కి తరలించారు. దీనిపై విచారణ కోసం కేసును సీఐడీకి అప్పగిస్తున్నామని రాష్ట్ర డీజీ వెల్లడించారు.

Also Read: 5 ఏళ్ల చిన్నారిని చంపేసిన మూఢ నమ్మకం.. కన్నకొడుకుకే నీటిలో ముంచి హతమర్చిన తల్లిదండ్రులు!

అనుమతి నిరాకరణ

ఇదిలా ఉండగా.. జనవరి 22 (సోమవారం) రోజున రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రలో భాగంగా గువాహటిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. కానీ అక్కడి వాళ్లు అడ్డుకోవంతో ఉద్రికత్తలు జరిగాయి. దీంతో ట్రాఫిక్ కారణం వల్ల నగరంలో ఈ యాత్రను చేపట్టేందుకు అస్సాం సర్కార్‌ అనుమతి ఇచ్చేందుకు నిరాకరించింది. యాత్రను కొనసాగించేందుకు బైపాస్ నుంచి వెళ్లాలని సూచనలు చేసింది.

రాహుల్ గాంధీని అరెస్టు చేస్తాం

ఈ క్రమంలోనే న్యాయ యాత్రను నగరంలోకి ప్రవేశించకుండా చేసేందుకు పోలీసులు అప్పటికే బారికేడ్లు అడ్డుపెట్టారు. కానీ కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రం వాటిని తోసుకుని మరీ ముందుకు వెళ్లారు. దీంతో పోలీసులు, పార్టీ కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. అయితే కాంగ్రెస్ కార్యకర్తల్ని రాహుల్ గాంధీ రెచ్చగొట్టారని ఆరోపిస్తూ.. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ.. రాహుల్‌పై కేసు నమోదు చేయాంటూ పోలీసులకు ఆదేశించారు. యాత్ర పేరుతో రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించడమే కాంగ్రెస్ పార్టీ ఉద్దేశమంటూ విమర్శించారు. లోక్‌సభ ఎన్నికలు జరిగిన తర్వాత రాహుల్ గాంధీని అరెస్టు చేస్తామంటూ వ్యాఖ్యానించారు.

Also Read: కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై గవర్నర్ సీరియస్

Advertisment
తాజా కథనాలు