Car Accident:కూకట్‌పల్లిలోని కేపీహెచ్బీ కాలనీ ఫోరం మాల్ సర్కిల్ దగ్గర ఓ కారు బీభత్సం సృష్టించింది. ఈరోజు తెల్లవారు ఝామున మాజీ మంత్రి మేనల్లుడు అగ్రజ్‌రెడ్డి, నలుగురు ఫ్రెండ్స్ ఫుల్‌గా మందు కొట్టి కారు నడిపారు. కూకట్ పల్లి ఫోరమ్‌మాల్ దగ్గర రాంగ్ రూట్‌లో కార్ నడిపి ఓ బైక్‌ను ఢీకొట్టారు. దీంతో, బైక్‌పై ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. దీని ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యాక్సిడెంట్ చేసిన వెంటనే నిందుతులు కారు అక్కడే వదిలేసి పారిపోయారు.
Also Read:ఏపీలో ఈరోజు నుంచి మూడు రోజులపాటూ ఈసీ పర్యటన
కొన్ని రోజుల క్రితమే ఇలాంటి సంఘటనే హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. ప్రజాభవన్ వద్ద డిసెంబర్ ఆదివారం రాత్రి అతివేగంగా వచ్చిన ఓ బీఎండబ్ల్యూ కారు భారీకేడ్లను ఢీ కొట్టింది. ఆ సమయంలో కారులో ఇద్దరు యువకులతో పాటు ఇద్దరు యువతులు కూడా ఉన్నారు. ఆ కారు బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహెల్ దని చెబుతున్నారు పోలీసులు. వీళ్లంతా స్టూడెంట్స్ అని.. కారు డ్రైవ్ చేసింది బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సోహెల్ అని కన్ఫామ్ చేశారు. ప్రస్తుతం సోహెల్ పరారీలో ఉండగా.. అతడి కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. మిగతా యువకులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. సోహెల్‌ను తప్పించుకోవడానికి సహాయం చేసిన సీఐ దుర్గారావును సస్పెండ్ కూడా చేశారు. సోహెల్‌ను ఇంకా పట్టుకోనే లేదు ఇప్పుడు మరో మాజీ మంత్రి మేనల్లుడు అదే దారుణానికి ఒడిగట్టాడు.
యాక్సిడెంట్ జరిగిన తర్వాత షకీల్ ఇంట్లో డ్రైవర్‌గా పని వేసే వ్యక్తి.. తానే డ్రైవ్ చేసినట్లుగా పోలీస్ స్టేషన్‌కు వచ్చాడని వెల్లడించారు. షకీల్ డ్రైవర్ పోలీసుల్ని తప్పుదోవ పట్టించే యత్నం చేశాడని.. కానీ సీసీ ఫుటేజీ ద్వారా సోహెల్ కారు నడిపినట్లు గుర్తించినట్లు చెప్పారు. మద్యం మత్తులో బారికేడ్లను ఢీకొట్టారని చెబుతున్నారు. సోహెల్‌పై గతంలోనూ జూబ్లీహిల్స్‌లో ఓ యాక్సిడెంట్ కేసు నమోదు అయింది.