Hathras Stampede: హథ్రస్ తొక్కిసలాటకు కారణం ?.. కీలక విషయాలు బయటపెట్టిన సిట్ యూపీలో హథ్రస్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనపై విచారణ చేపట్టిన సిట్ కీలక విషయాలు వెల్లడించింది. తొక్కిసలాటకు ఈవెంట్ నిర్వాకులదే బాధ్యత అని.. స్థానిక యంత్రాంగం కూడా నిర్లక్ష్యం వహించిందని పేర్కొంది. ఈ ఘటనలో కుట్ర ఉన్నట్లు కూడా కొట్టిపారేయలేమని చెప్పింది. By B Aravind 09 Jul 2024 in Latest News In Telugu Uncategorized New Update షేర్ చేయండి SIT Report On Hathras Stampede: ఉత్తరప్రదేశ్‌లోని హథ్రస్‌లో జరిగిన భోలే బాబా (Bhole Baba) సత్సంగ్ కార్యక్రమంలో తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ విషాద ఘటనలో 121 మంది ప్రాణాలు కోల్పోయారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న యూపీ సర్కార్ ముగ్గురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన సిట్.. నివేదికను మంగళవారం రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. తొక్కిసలాటకు ఈవెంట్ నిర్వాకులదే బాధ్యత అని.. స్థానిక యంత్రాంగం కూడా నిర్లక్ష్యం వహించిందని సిట్ తెలిపింది. సిట్ నివేదిక ప్రకారం.. ' ప్రత్యక్ష సాక్షులు, ఇతర సాక్ష్యాల ఆధారంగా.. తొక్కిసలాటకు కార్యక్రమాన్ని నిర్వహించిన ఆర్గనైజర్ల వైఫల్యమే కారణమని ప్రాథమికంగా తేలింది. వాస్తవాలను చెప్పకుండా నిర్వాహకులు సత్సంగ్ కార్యక్రమానికి పర్మిషన్ తీసుకున్నారు. ఎలాంటి షరతులు కూడా పాటించలేదు. ఈవెంట్‌కు ఎక్కువమందిని ఆహ్వనించారు. కానీ వాళ్లకు కనీస ఏర్పాట్లు కూడా చేయలేదు. ఎలాంటి పోలీసు వెరిఫికేషన్ చేయకుండానే వాలంటీర్లను నియమించారు. భద్రతాపరమైన ఏర్పాట్లు చేయలేదు. రద్దీ ఎక్కువైతే వాళ్లు బయటకు వెళ్లేందుకు బారికేడ్లు కూడా పెట్టలేదు. తొక్కిసలాట జరగ్గానే నిర్వాహకుల కమీటీలోని సభ్యులు ఆ కార్యక్రమం ప్రాంగణం నుంచి పరారయ్యారు. Also Read: ఉత్పత్తులు నిలిపివేశాం.. సుప్రీంకోర్టుకు వెల్లడించిన పతంజలి స్థానిక యంత్రాంగం, పోలీసులు కూడా ఈ కార్యక్రమాన్ని సీరియస్‌గా తీసుకోలేదు. సత్సంగ్ జరగే ఆ వేదిక ప్రాంగణాన్ని తనిఖీలు చేయడకుండానే.. కనీసం సీనియర్లకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే సబ్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఆ ఈవెంట్‌కు పర్మిషన్ ఇచ్చారు. రెవెన్యూ అధికారి, సర్కిల్ ఆఫీసర్, ఔట్‌పోస్ట్ ఇన్‌ఛార్జ్, ఇన్‌స్పెక్టర్ అందరూ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈ ఘటనలో కుట్ర కోణాన్ని కూడా కొట్టిపారేయలేం. దీనిపై సమగ్ర దర్యాప్తు అవసరమని' సిట్ వివరించింది. సిట్ రిపోర్టు ఆధారంగా యూపీ సర్కార్.. స్థానిక సబ్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్, సర్కిల్ అధికారితో సహా మరో నలుగురు అధికారుల్ని మంగళవారం సస్పెండ్ చేసింది. ఇదిలాఉండగా జులై 2న హథ్రాస్‌లో సత్సంగ్ కార్యక్రమం జరిగింది. 80 వేల మంది భక్తులు హాజరవుతారని నిర్వాహకులు పోలీసుల నుంచి పర్మిషన్ తీసుకున్నారు. కానీ 2.5 లక్షల మందికి పైగా అక్కడికి వచ్చారు. భోలే బాబా వెళ్తుండగా ఆయన దర్శనం కోసం అక్కడున్నవారు ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో తొక్కిసలాట జరిగి 121 మంది ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇప్పటివరకు 9 మందిని అరెస్టు చేశారు. Also Read: కథువా ఉగ్రదాడిపై ప్రతీకారం తీర్చుకుంటాం : భారత్ #telugu-news #hathras #bhole-baba #sit-report మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి