వాటే ఐడియా గురూ.. గాడిదపై వచ్చి నామినేషన్ వేశాడు.. మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్ జిల్లాలో ఓ స్వతంత్ర అభ్యర్థి గాడిదపై వెళ్లి నామినేషన్ వేసి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశారు. దేశంలో వంశ పారంపర్య రాజకీయాలకు వ్యతిరేకంగా ఇలా గాడిదపై వచ్చి నామినేషన్ వేసినట్లు క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. By B Aravind 27 Oct 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి ఎన్నికలు వచ్చాయంటే రాజకీయ నేతల ప్రచారాలతో సందడి వాతావరణం నెలకొంటుంది. ఇక నామినేషన్లు వేసే సమయంలో కారు, బైకు, లేదా ట్రాక్టర్‌పై తమ పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీగా వెళ్తుంటారు. కానీ ఓ స్వతంత్ర అభ్యర్థి మాత్రం నామినేషన్ వేసేందుకు వినూత్న ప్రయాణం చేశారు. ఏకంగా ఓ గాడిదపై వెళ్లి రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలు అందించారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. బుర్హాన్‌పూర్ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి అయిన ప్రియాంక్ థాకూర్ అనే వ్యక్తి ఇలా గాడిదపై వెళ్లి అందర్ని అవాక్కయ్యేలా చేశారు. ఇక రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించిన తర్వాత ప్రియాంక్ సింగ్ దీనిపై స్పందించారు. దేశంలో వంశ పారంపర్య రాజకీయాలకు వ్యతిరేకంగా ఇలా చేశానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా కూడా ఎక్కువగా కొన్ని కుటుంబాల్లోని తాతలు, తండ్రులు, మనుమలు మాత్రమే ప్రజాప్రతినిధులుగా ఎన్నికల్లో గెలుస్తూ వస్తున్నారని అన్నారు. ఇలాంటి ప్రజాస్వామ్య దేశంలో ఈ సంప్రదాయం మంచిది కాదన్నారు. చాలా ప్రాంతాల్లో చూసినట్లైతే అధికారం ఎప్పటికీ ఒకే కుటుంబం చేతిలో ఉంటోందని, ఆ అధికారంతోనే ఆ ప్రాంతానికి చెందిన ప్రజలను వారు గాడిదలను చేసి వాడుకుంటున్నారని ప్రియాంక్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే వంశ పారంపర్య రాజకీయాలపై తనకున్న వ్యతిరేకతను చాటి చెప్పేందుకే ఇలా గాడిదపై వచ్చి నామినేషన్ వేశానని స్పష్టం చేశారు. అయితే ఈయనకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. #telugu-news #national-news #elections #assembly-elections మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి