National : అసదుద్దీన్ జై పాలస్తీనా నినాదంపై వివాదం.. ఆయన ఇచ్చిన వివరణ ఇదే!

పార్లమెంటులో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చేసిన జై పాలస్తీనా నినాదం వివాదం రేపుతోంది. వేరే దేశానికి జై ఎలా కొడతారు అందులో అడుగుతుంటే...అందులో తప్పేముందుని అసదుద్దీన్ అంటున్నారు. అయితే సభ్యులు మాత్రం దీని మీద కంప్లైట్ చేశారని అంటున్నారు పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి కిరణ్ రిజిజు.

New Update
National : అసదుద్దీన్ జై పాలస్తీనా నినాదంపై వివాదం.. ఆయన ఇచ్చిన వివరణ ఇదే!

MP Asaduddin Owaisi : తెలంగాణ (Telangana) ఎంపీ, ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ (Asaduddin Owaisi) ఈరోజు పార్లమెంటులో ప్రమాణ స్వీకారం చేశారు. దీని తర్వాత ఆయన జూ పాలస్తీనా అంటూ నినాదాలు చేశారు. ఆ విషయం ఇప్పుడు దుమారం రేపుతోంది. భారతదేశ పార్లమెంటులో జై పాలస్తీనా అంటూ నినాదాలు చేయడం ఏంటని మిగిలిన నేతలు ప్రశ్నిస్తుననారు. భారత రాజ్యాంగం (Indian Constitution) దీన్ని ఎలా ఒప్పుకుంటుందని అడుగుతున్నారు. అసదుద్దీన్ మీద పార్లమెంటరీ వ్యవహారా శాఖకు కంప్లైంట్ కూడా చేశారు.

అయితే తాను చేసిన దానిలో తప్పేముందని అడుగుతున్నారు ఎంపీ అసదుద్దీన్. ప్రమాణం చేసటప్పుడు ఒక్కొక్కరు ఒక్కో స్లోగన్ చేశారు. అలాగే నేను కూడా అన్నాను. జైపాలస్తీనా తో పాటూ జై భీమ్, జై మీమ్, జై తెలంగాణ అని కూడా అన్నాను. అదెలా తప్పు అవుతుంది అని అడిగారు. అలా స్లోగన్ చేయడం తప్పు అని రాజ్యాంగంలో ఉందా అని ప్రశ్నించారు. ఇక మన పార్లమెంటులో పాలస్తీనా గురించి మాట్లాడ్డం పరి అయినదేనా అడిగిన ప్రశ్నకు సమాధానంగా... ఆ దేశం గురించి మహాత్మాగాంధీ ఏం చెప్పారో చూసుకోండి అంటూ బదులు చెప్పారు. అది కాక అన్నదేదో అనేశాను... దాని మీద ఎందుకు రాద్ధాంత చేస్తున్నారు అని కూడా అన్నారు అసదుద్దీన్. తాను అన్నది తప్పు అయితే పార్లమెంటరీ వ్యవహారాలశాఖ చూసుకుంటుందని అన్నారు.

ఇక అసదుద్దీన్ నినాదం మీద పార్లమెంటరీ వ్యవహారాలశాక మంత్రి కిరణ్ రిజిజు కూడా స్పందించారు. తమకు ఏ దేశంతోనూ శత్రుత్వం లేదని ఆయన అన్నారు. అయితే ఇలా మన పార్లమెంటు (Parliament) లో మరో దేశం గురించి పొగుడుతూ స్లోగన్స్ చేయడం సరైనదా, కాదా అన్నది పరిశీలించాల్సి ఉందని ఆయన చెప్పారు. రాజ్యాంగంలో నిబంధనలను చూడాల్సి ఉందని కిరణ్ రిజిజు అన్నారు. అసదుద్దీన్ చేసిన నిఆదాల మీద కొందరు సభ్యులు తనకు ఫిర్యాదు చేశారని... వాటిని పరిగణనలోకి తీసుకుంటున్నామని తెలిపారు.

Also Read:Movies: భారతీయుడు ఈజ్ బ్యాక్..2 ట్రైలర్ వచ్చేసింది

Advertisment
తాజా కథనాలు