Movies: భారతీయుడు ఈజ్ బ్యాక్..2 ట్రైలర్ వచ్చేసింది తప్పు చేస్తే ప్రాణాలు పోతాయి అన్న భయం మళ్ళీ వచ్చేసింది. ఎంతవారైనా, ఎవరైనా తప్పు చేశారో ఆయన చేతిలో చావాల్సిందే. కమల్ హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన భారతీయుడు సినిమా మళ్ళీ వెండితెరల మీద మెరవనుంది. భారతీయుడు-2 ట్రైలర్ రిలీజ్ అయింది. By Manogna alamuru 25 Jun 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి 1996లో దర్శకుడు శంకర్ , విశ్వనటుడు కమల్ హసన్ చేసిన భారతీయుడు-2 సినిమా ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అప్పటి నుంచి దీని సీక్వెల్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు అందరూ. ఇప్పుడు ఇన్నాళ్ళకు భారతీయుడు-2 విడుదలకు సిద్ధమైంది. జూలై 12న ఈ సినిమా రిలీజ్ అవనుంది. దీని ట్రైలర్‌ను ఈరోజు సషల్ మీడియా వేదికగా విడుదల చేసింది మూవీ టీమ్. లంచగొండతనం,అవినీతి, అక్రమాలను అరికట్టానికి సేనాపత ఈసారి ఏం చేనునన్నాో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేవరకూ వేచి చూడల్సిందే. ఇందులో కమల్‌హసన్‌తో పాటూ కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్ధార్ధ, ఎస్‌జె. సూర్య, సముద్రఖని కీలక పాత్రల్లో నటించారు. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను గ్రాండ్ గా తెరకెక్కించారు. లైకా ప్రొడక్షన్స్ మరియు రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్ పై ఉదయనిధి స్టాలిన్ -సుభాస్కరన్ భారతీయుడు 2 సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించారు. అనిరుధ్ దీనికి సంగీతాన్ని సమకూర్చాడు. ఇప్పుడు రిలీ చేసిన ట్రైలర్ కూడా అదిరిపోయింది. ఇది సినిమా మీద మరింత హైప్‌ను పెంచేలా ఉంది. మొదటి భాగంలో సేనాపతిని మళ్ళీ ఎందుకు వెనక్కి తీసుకు రావాల్సి వచ్చింది అనేదాన్ని ఆసక్తికరంగా చూపించారు. #bharateeyudu-2 #kamal-hassan #movies #shankar మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి