Athishi: ఢిల్లీ మద్యం కుంభకోణం (Delhi Liquor Scam) కేసులో గురువారం రాత్రి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ (Kejruiwalను ఈడీ (ED) అరెస్ట్ చేసింది. ఆయన అరెస్ట్ ఆప్ మంత్రులు, ముఖ్య నాయకులు ఖండించారు. ఈడీ అధికారులు కేంద్ర పెద్దల ఒత్తిడితోనే కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసినట్లు ఆరోపించారు. కేజ్రీవాల్ అంటే ప్రజలకు ప్రేమ , అభిమానం అని ఆప్ మంత్రి అతిషి అన్నారు.
ఏవేవో కారణాలు చూపించి ఈడీ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయోచ్చు ఏమో కానీ, ఆయన ఆలోచనలను మాత్రం అరెస్ట్ చేయలేరని ఆమె పేర్కొన్నారు. ఒక కేజ్రీవాల్ ను అరెస్ట్ చేస్తే వీధికో కేజ్రీవాల్ పుట్టుకొస్తాడని ఆమె అన్నారు. సోదాల పేరుతో ఈడీ అధికారులు కేజ్రీవాల్ ఫోన్, ఆయన సెక్రటరీ ఫోన్ కూడా తీసేసుకున్నారని ఆమె అన్నారు.
ఎన్నికలు దగ్గర పడుతుండడంతో బీజేపీ తన కుటిల బుద్దిని ప్రదర్శించిందని ఆప్ నేతలు సౌరభ్ భరద్వాజ్, అతిషి ఆరోపించారు. కేజ్రీవా్ అరెస్ట్ అయినా సరే ఆయన జైలు నుంచే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని, ఆయనే పరిపాలన సాగిస్తారని ఆమె స్పష్టం చేశారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎట్టకేలకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. దాదాపు 12 మంది అధికారుల టీం ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించిన అనంతరం కేజ్రీవాల్ ను అదుపులోకి తీసుకున్నారు.
దీంతో కేజ్రీవాల్ నివాసం వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. దాదాపు 4గంటల పాటు కేజ్రీవాల్ ను విచారించిన అనంతరం అరెస్టు చేసింది. కాగా మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతోపాటు తదితరులను ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
కేజ్రీవాల్ ను అరెస్టు చేసిన అనంతరం ఈడీ ప్రధాన కార్యాలయానికి తరలించింది. అక్కడే సీఎం కేజ్రీవాల్ కు వైద్యపరీక్షలు నిర్వహించనున్నారు. మార్చి 22( శుక్రవారం) పీఎంఎల్ఏ కోర్టులో కేజ్రీవాల్ ను హాజరుపరచనున్నారు. కోర్టుకు హాజరుకాకుముందే వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఆర్ఎంఎల్ అసుపత్రి బృందం ఈడీ కార్యాలయానికి చేరుకుని వైద్య పరీక్షలు నిర్వహించనుంది.
ఈ కేసులో ఈడీ అధికారులు కేజ్రీవాల్ కు ఇప్పటి వరకు 10 సార్లు నోటీసులు ఇచ్చింది. కానీ ఆయన ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఈడీ ముందు హాజరు కాలేదు. ఈడీ సమన్ల పై కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.కానీ అందుకు ఢిల్లీ కోర్టు నిరాకరించింది.
Also read:ఈడీ తన 68 ఏళ్ల చరిత్రలో తొలిసారి ఇలా!