Lok Sabha Elections Campaign Ends: ఏడో దశ లోక్‌సభ ఎన్నికలు జూన్ 1న జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచార గడువు ముగిసింది. దీంతో లోక్‌సభ ఎన్నికల చివరి దశ ప్రచారానికి తెరపడింది. జూన్ 1న ఏడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంతో కలిపి మొత్తం 57 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఉత్తర ప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్ , జార్ఖండ్, పంజాబ్, ఒడిశా రాష్ట్రాలు, అలాగే కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్‌లో పోలింగ్ జరగనుంది.
Also Read: ఎవరెస్ట్ శిఖరం పై ట్రాఫిక్ జామ్..వైరల్ అవుతున్న పోస్ట్!
ఈ చివరి దశ ఎన్నికల్లో ప్రధానమంత్రి (PM Modi) పోటీచేస్తున్న వారణాసి పార్లమెంటు స్థానం కూడా ఉంది. అలాగే హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నుంచి బాలీవుడ్ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut), పశ్చిమ బెంగాల్‌లో డైమండ్ హర్బర్ స్థానం నుంచి సీఎం మమతా బెనర్జీ అల్లుడు అభిషేక్ బెనర్జీ, బీహార్‌లో పాటలీపుత్ర నుంచి జేడీయూ నేత లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు మీసా భారతి కూడా ఈ ఎన్నికల బరిలో ఉన్నారు.
లోక్‌సభ ఎన్నికలు ఏడు దశల్లో జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆరు దశల్లో ప్రశాంతంగా ఎన్నికలు పూర్తయ్యాయి. ఏడో దశలో కూడా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. ఏప్రిల్ 19న ప్రారంభమైన మొదటి దశ లోక్‌సభ ఎన్నికలు.. జూన్ 1 నాటికి ఏడో దశతో ముగియనున్నాయి. ఇక జూన్ 4న ఓట్ల లెక్కింపు ఉంటుంది. అయితే ఈసారి కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తారనే దానిపై దేశవ్యాప్తంగా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Also read: నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి