త్వరలో తెలంగాణ కేబినెట్ విస్తరణ జరగనుందని.. వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. శాఖల్లో మార్పులు, చేర్పులు ఉండే అవకాశం ఉందన్నారు. సీతక్కు హోంమంత్రి పదవి ఇచ్చే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. అలాగే కేబినేట్‌లో రాజగోపాల్ రెడ్డి, దానం నాగేందర్‌కు చోటు దక్కే అవకాశం ఉందన్నారు. నిజామాబాద్ నుంచి కేబినెట్‌లో ఒకరికి స్థానం ఉందని చెప్పారు.
Also read: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే
ఇదిలాఉండగా.. ప్రస్తుతం తెలంగాణలో ఆరు కేబినేట్ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇప్పటికే మంత్రి పదవుల కోసం పలువురు నేతలు లాబీయింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం బీఆర్‌ఎస్ నుంచి పలువురు కీలక నేతలు కాంగ్రెస్‌లోకి చేరుకున్న సంగతి తెలిసిందే. ఇంకా మరికొందరు కూడా వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. చేరికలు పూర్తయ్యాకే కేబినెట్ విస్తరణ చేపట్టాలని రేవంత్ సర్కార్ నిర్ణయించినట్లు సమాచారం.